ప్రకాశం: శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీసులు గురువారం దర్శిలోని సాయినగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లల్లో, ముఖ్యమైన కూడళ్లు, పలు షాప్‌లలో డ్రోన్ కెమెరాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని మూడు ఆటోలు, 30 బైకులను స్వాధీనం చేసుకున్నారు.