HYD: బల్కంపేట రోడ్డులో గురువారం ట్రాఫిక్ నియంత్రణ చర్యలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్, నిషేధిత ప్రదేశాలలో ట్రాఫిక్కు ఆటంకం కలిగే విధంగా నిలిపిన వాహనాలను స్టేషన్కు తరలించామని SR నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని CI హెచ్చరించారు.