కోనసీమ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్, సీడాప్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉదయం 10:30 గంటలకు ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి వసంతలక్ష్మి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు, బీఫార్మసీ, ఎంఫార్మసీ చదివిన వాళ్లు అర్హులని చెప్పారు. తమ సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరు కావాలని సూచించారు.