PDPL :సుల్తానాబాద్‌లోని గర్రెపల్లి మోడల్ స్కూల్లో మాదకద్రవ్యాల అనర్థాలపై గురువారం ఎక్సైజ్ సీఐ గురునాథ్, ఎస్ఐ చిరంజీవి అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ‘డ్రగ్స్ రహిత సమాజాన్ని తయారు చేస్తాం’ అని ఉపాధ్యాయులతో ప్రమాణం చేయించారు. కోర్సు డైరెక్టర్ రాజయ్య, మారుతి రాజు, ప్రద్యుమ్నకుమార్ తదితరులున్నారు.