కొత్తగూడెం: భద్రాద్రి సీతా రాముల ఆలయంలో హుండీల్లో భక్తులు వేసిన కానుకలను ఈనెల 30న లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి తెలిపారు. తొలుత ఈనెల 26న హుండీ లెక్కింపు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తరువాత ఈనెల 30కు లెక్కింపు కార్యక్రమాన్ని మార్చినట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు ఆలయ మండపంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు.