ADB: బోథ్ మండలంలోని కౌట(బి) గ్రామస్తులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ ఆడే గజేందర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. రెడ్డి సంఘ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వారు విన్నవించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతారెడ్డి, మండల నాయకులు తదితరులున్నారు.