MDK: రామాయంపేటలో గురువారం కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కేవల్ కిషన్ 63వ వర్ధంతి సందర్భంగా స్థానిక మెదక్ చౌరస్తాలో సీపీఎం నాయకురాలు బలమని ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదల భూమి కోసం పోరాడిన నాయకుడు కేవల్ కిషన్ అని ఆమె అన్నారు.