BDK: కూనవరం మండలం చిన్నార్కూరు పంచాయతీలో పీసా ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో ఉపాధ్యక్ష, కార్యదర్శులుగా కారం దారయ్య కుంజా అనిల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని, చట్టానికి అనుగుణంగా ప్రతి పనిలోనూ ప్రజలందరి సహకారాలతో తమ బాధ్యతలను స్వీకరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
WNP: కొత్తకోట పట్టణంలోని 2025 ఫిబ్రవరి నెలలో 11, 12, 13 తేదీల్లో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గురువారం విరాళాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు ముంత చిన్న తిమ్మన్న యాదవ్, ముంత బజార్ యాదవ్, కనాపల్లె కురుమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
KMM: నిరుపేదలకు సీఎం సహాయనిధి ఓ వరమని జిల్లా కాంగ్రెస్ నేత బోడా వెంకన్న గురువారం అన్నారు. తీర్థాల గ్రామపంచాయతీ బీసీ కాలనీలో లబ్ధిదారులకు రూ.29 వేలు విలువగల CMRF చెక్కును గ్రామ కాంగ్రెస్ నేతలతో కలిసి వెంకన్న పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
KMM: నిరుపేదలకు సీఎం సహాయనిధి ఓ వరమని జిల్లా కాంగ్రెస్ నేత బోడా వెంకన్న గురువారం అన్నారు. తీర్థాల గ్రామపంచాయతీ బీసీ కాలనీలో లబ్ధిదారులకు రూ.29 వేలు విలువగల CMRF చెక్కును గ్రామ కాంగ్రెస్ నేతలతో కలిసి వెంకన్న పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
MNCL: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం మండలాల రైతులకు వరప్రదాయనిగా ఉన్న సదర్ మాట్ కాలువ నుండి నీటిని విడుదల చేయనున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సదర్ మాట్ నుండి ఖానాపూర్, కడెం మండలంలోని పలు గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు అందుతుంది. యాసంగి సీజన్లో రైతుల పొలాలకు జనవరి 2 నుండి ఏప్రిల్ 17 వరకు వారాబంది పద్ధతిలో సాగునీటినీ విడుదల చేయనున్నారు.
GDWL: గద్వాల పట్టణం 24వ వార్డు నందు శ్రీ ఆంజనేయ స్వామి గుడి కాంపౌండ్ వాల్‌కు గురువారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఐదు లక్షల రూపాయల వ్యయంతో కాంపౌండ్ వాల్‌కు నిధులు మంజూరైనట్లు 24వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తెలియజేశారు.
NZB: చందూర్ మండల కేంద్రంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కాసుల బాలరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన పరుచూరి చంద్రావతి దంపతులను, దాతలను సన్మానించారు.
HYD: గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఎమర్జెన్సీ వార్డు ఎదుట వెయిటింగ్ హాల్లో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్‌బాడీ వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. ఫొటోలోని మహిళను గుర్తుపట్టినవారు PSలో సమాచారం ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోరారు.
కామారెడ్డి: గాంధారి మండలం నాగులూరు గ్రామస్తులు గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మండల మోహన్ రావును హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నుంచి నాగులూర్ గ్రామానికి సాగునీరు, తాగునీరు విషయంపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి గ్రామానికి సాగునీరు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు అని తెలిపారు.
ADB: జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో సీపీఎం ఏరియా కమిటీ సమావేశం నిర్వహించి మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. మహాసభల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించటం జరుగుతుందన్నారు.
GDWL: గట్టు మండలం పర్యటనకు రేపు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే.అరుణలు రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి గురువారం తెలిపారు. అక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొని మూడు గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొని 4.30కు ఎంపీ అరుణ ఇంటి వద్ద తేనీటి విందులో పాల్గొంటారని తెలిపారు.
HYD: BRS రాష్ట్ర నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
NZB: ప్రతి ఒక్కరూ దేశ చరిత్ర తెలుసుకొని దేశభక్తి పెంపొందించుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 1705లో వాజిర్ ఖాన్ చేతిలో వీర మరణం పొందిన గురు గోవింద్ పుత్రులు అజిత్ సింగ్, జుజర్ సింగ్, జోరవర్ సింగ్, ఫేతే సింగ్ చిత్రపటాలకు వారు నివాళులర్పించారు.
నిజామాబాద్: రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ సర్వీస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిల్లా కార్యాలయంలో జైపూర్ కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. గతంలో కొలతలు తీసుకున్న 32 మందికి అందజేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయరావ్, మాజీ అధ్యక్షుడు ఇంగు రాజేశ్వర్, శ్రీరామ్ సోనీ, గంగారెడ్డి, ప్రకాష్, జితేంద్ర మలాని, జ్ఞాన ప్రకాష్, రాజ్ కుమార్ ఉన్నారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని హల్దా గ్రామం 48వ బూత్ అధ్యక్షునిగా చదల రాజు సెక్రటరీగా నాగేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దత్తాతి ఎలక్షన్ ఇంఛార్జ్ బొడిగాం వినయ్, క్రియాశీల సభ్యత్వ నమోదు మండల కన్వీనర్ గణేష్ కులకర్ణిలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హల్దా గ్రామ బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.