ADB: జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో సీపీఎం ఏరియా కమిటీ సమావేశం నిర్వహించి మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. మహాసభల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించటం జరుగుతుందన్నారు.