భద్రాద్రి జిల్లా నుంచి సీఎం కప్ -2024రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన 600మంది క్రీడాకారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభినందనలు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే దగ్గరుండి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫేడ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, DYSO పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.