MDK: మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐ పదోన్నతులు కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఏఎస్సైగా పదోన్నతులు పొందిన జానీ భాష, ఉమర్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిద్దరికీ స్టార్లను ఏర్పాటు చేసి అభినందించారు.