NLG: నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. శౌలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామంలో కల్తీ కల్లు తాగి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు వారిని నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.