WGL: నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈరోజు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాస్పిటల్కి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్ది ఉన్నారు.