HYD: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగాల కోసం ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తిచేసి, వయోపరిమితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.