NLG: మునగాల మండల కేంద్రంలో 2025 సంవత్సరానికి గాను మునగాల మండల వాసవి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వాసవి క్లబ్ మండల మాజీ అధ్యక్షుడు కాపర్తి మణికంఠ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షులుగా అర్వపల్లి ప్రవీణ్, కార్యదర్శిగా కందిబండ సతీష్, కోశాధికారిగా బ్రహ్మదేవర అఖిల్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు.