MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులు వెంట రాగా మాజీ ఎమ్మెల్యే సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయపరమైన కోరిక తీర్చాలని డిమాండ్ చేశారు.
MDK: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం గజ్వేల్ రూరల్ మండలం పిడిచేడ్ గ్రామంలో మాజీ DSP నళిని సనాతన ధర్మంఫై రచించిన “వేద యజ్ఞం” పుస్తక ఆవిష్కరణలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండే పిల్లలకు సనాతధర్మం విశిష్టతను తెలిపి ఆచారాలు అలవాటు చేయాలన్నారు.
NLG: భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని గురువారం వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన యువజన నాయకులు చేగూరి మల్లేష్, గ్రామస్తులు కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా బునాదిగాని కాలువ పనులు పూర్తి చేయాలని, టేకులసోమారం గ్రామాభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని కోరారు.
WGL: సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ & గ్రోవర్ ఫెడరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ మహిళ హాస్టల్‌ను మూసేయాలని SFI, DYFI ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ మహిళా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న హాస్టల్ వార్డెన్ శ్యామ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ హాస్టల్లో పురుషులకు ఏమీ అవసరమని వారు ప్రశ్నించారు.
NGKL: ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన సెల్ ఫోన్‌ను ఆర్టీసీ బస్ డ్రైవర్ ప్రయాణికుడికి తిరిగి అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. కొల్లాపూర్ నుంచి నాగర్ కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్‌ని మరచిపోయాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఊరుకొండ సత్యం ప్రయాణికుడి వివరాలు సేకరించి సెల్ ఫోన్‌ను గురువారం అప్పగించాడు.
WGL: ఆత్మకూర్ మండల కేంద్రంలోని నిర్మానుష్య ప్రదేశాల్లో గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తులకు ఎస్సై సంతోష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి వినియోగం, విక్రయాలకు పాల్పడితే తీసుకునే చర్యలతో పాటు కలిగే నష్టాలపై ఎస్సై వివరించారు. ఎవరైనా గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
HYD: నాంపల్లి కోర్టులో ఎర్రోళ్ల శ్రీనివాస్ రిమాండ్పై ఉత్కంఠ వీడింది. వాదనల అనంతరం ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాసు విచారణకు సహకరించాలని న్యాయస్థానం సూచించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
NRPT: మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండల కేంద్రానికి నవోదయ పాఠశాలను కేటాయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరారు. గురువారం నర్వ మండలంలోని రాయికోడ్ గ్రామానికి కేంద్రమంత్రి విచ్చేసిన సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేశారు.
BDK: ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్య గురువారం మంత్రి సీతక్కను పాల్వంచలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఇల్లందు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
JGL: జగిత్యాల జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సమర్థవంతమైన చురుకైన నాయకత్వంతో జగిత్యాల జిల్లా పోలీస్ డిపార్ట్‌మెంట్ పని చేస్తుందని ఎస్పీ వెల్లడించారు. గురువారం జగిత్యాల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన జిల్లా వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.
MNCL: జనవరి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం జాతీయ రెండవ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. గురువారం రామకృష్ణాపూర్‌లో ఆయన విరాళాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో దళితుల అభ్యున్నతిపై మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు.
SDPT: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జిల్లెల్ల ఫణిందర్ నియామకామయ్యారు. సిద్దిపేటలో జరుగుతున్న 43వ రాష్ట్ర మహాసభలలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లుగా నారాయణరావుపేట మండల వాసి జిల్లెల్ల ఫణిందర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, అలాగే విద్యారంగాకి కృషి చేస్తా అన్నారు.
KMM: వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఈరోజు కారేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కారేపల్లి క్రాస్ రోడ్ నందు నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లును భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
KMM: అశ్వారావుపేట పర్యటన అనంతరం ములకలపల్లికి వెళ్తున్న మంత్రి పొంగులేటి గురువారం మార్గమధ్యంలో వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుని, సంక్రాంతి నాటికి ఇళ్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు చేతి గాజులు వేయించుకోవడానికి కొంత నగదు అందజేశారు.