SRPT: చివ్వేంల మండలం గుంపుల గ్రామంలో TRP సర్పంచ్ అభ్యర్థి పచ్చిపాల ప్రియాంక మధు యాదవ్ గెలుపు కోసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధి సందర్శించి TRP సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. సేవాస్ఫూర్తి కలిగిన ప్రియాంక మధు యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
MHBD: తొర్రూరు మండలం సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పారిజాతం తరపున ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి పారిజాతంని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.
BHPL: రేగొండ మండలం పోచంపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేసిరెడ్డి సబితా-ప్రతాప్ రెడ్డి అధిక మెజారిటీతో నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
RR: ప్రజలకు మంచి పాలన అందించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జ్యోతిర్మయి అంజిని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి, ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలన్నారు.
SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
SRD: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో సత్తయ్య అన్నారు. శుక్రవారం కంగ్టి ZPHS పాఠశాలలో సమావేశమందిరంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్, ఎంఈవో రహీమొద్దీన్, ట్రైనర్ స్వామి ఉన్నారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సర్పంచ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. అన్నా గెలిచి వచ్చాం అంటూ ఎమ్మెల్యేను సత్కరించి పూల బొకేను అందజేశారు. అభివృద్ధిలో ప్రజలను మమేకం చేయాలని, అభివృద్ధి కోసం తన సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఎన్నికయినా వారిని శాలువాతో సత్కారించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కి తమ వంతు సాకారం అందిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
MDK: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాడు పాపన్నపేట ఎంపీపీ.. నేడు బాచారం గ్రామ సర్పంచ్‌గా ఆమె గెలుపొందింది. మండల పరిధి లోని బాచారం గ్రామ సర్పంచ్‌గా సొంగ పవిత్ర దుర్గయ్య గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బాచారం గ్రామ అభివృద్ధికీ కృషి చేస్తానన్నారు.
SDPT: జీపీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మీరుదొడ్డి, నంగునూరు, నారాయణపేట, సిద్దిపేట రూరల్ సిబ్బంది పనిచేయన్నారు.
మహబూబ్ నగర్ మండలంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రకటించబడ్డారు. మణికొండ-రాజేశ్వరీ, ఓబ్లాయిపల్లి-సిద్దప్ప, ఓబ్లాయిపల్లి తండా-రఘునాయక్, పోతన్పల్లి-మాధవరెడ్డి, రామచంద్రపూర్-నర్సింహులు, రేగడిగడ్డ తండా-వెంకట్ నాయక్, తెలుగు గూడెం-హుసేనయ్య, తువ్వగడ్డ తండా-చాందీబాయి, వెంకటాపూర్-నారాయణ, జమిస్తాన్పూర్-లక్ష్మి విజయాలను సాధించారు.
SDPT: బెజ్జంకి మండల వ్యాప్తంగా 23 గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు అధికారికంగా ముగియనుంది. ఆదివారం జరిగే పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకొని సభలు,సమావేశాలు నిలిచిపోనున్నాయి. ప్రత్యేక హామీలు, వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు అభ్యర్థులు చేపట్టిన ప్రచారం రసవత్తరంగా కొనసాగుతుంది.
NRML: భక్తి మార్గంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న మహదేవ అన్నపూర్ణ దేవాలయం కాల భైరవ స్వామి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.
MDK: అల్లాదుర్గం మండలంలో నిర్వహించిన తొలి విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పలుచోట్ల నోటా, చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలో చెల్లని ఓట్లు 137, నోటాకు 29 ఓట్లు పోలింగ్ నమోదయ్యాయి. సంబంధిత అధికారులు పోలింగ్ విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
SRPT: తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి గెలుపొందారు. తొలి దశ ఎన్నికల్లో హోరాహోరీ పోరులో విజయం సాధించిన ఆయన ప్రజాసేవపై ఆసక్తి, ఆరోగ్యంతో బరిలో నిలవడం యువతకు స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ అభినందించారు. ఆయనను గెలిపించిన గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.