HYD: సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా అసలు వెడల్పు 20 మీటర్లు. కానీ, ప్యాట్నీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి అది 5 మీటర్లకు కుంచించుకుపోవడంతో మొత్తం 27 కాలనీలు ప్రతి ఏటా తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొనేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సంవత్సరం హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించడం, నాలా వెడల్పు పునరుద్ధరించడంతో ఈ సమస్య తీరిందని ఆయన పేర్కొన్నారు.
NLG: దేవరకొండ మున్సిపాలిటీలోని సంతోషిమాత కాలనీ, 17వ వార్డులో గరుడాద్రి దేవాలయం ప్రక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వస్కుల సుధాకర్, చిత్రం ఏసేపు, అంకురి పెద్ద మల్లయ్య, పొట్ట రత్నయ్య, అంకురి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ADB: ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా జాదవ్ విమల, ఉప సర్పంచిగా వర్షతాయి గెలుపొందారు. ఈ సందర్బంగా శుక్రవారం వీరితో పాటు వార్డు సభ్యులను గ్రామస్థులు కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్దలు వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పారదర్శకంగా పనిచేయాలని ప్రజలు కోరారు.
GDWL: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరిగే మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది. నాలుగు మండలాల పరిధిలో మొత్తం 74 గ్రామ పంచాయతీలకు గాను 18 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 56 జీపీలకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. కాగా, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
KMM: సింగరేణి మండలంలో ఎన్నికల విధుల్లో అంగన్‌వాడీ టీచర్ వనపట్ల విజయ కుమారి (51) మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొనిజర్ల మండలం డ్యూటీలో ఉండగా స్పృహ తప్పి పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఎన్నికల విధుల్లో మరణించిన ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు.
MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఉపసర్పంచ్‌గా అప్పాల జలపతి ఎంపికయ్యారు. గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జలపతి ఏడవ వార్డు నుంచి వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. దీంతో శుక్రవారం సర్పంచ్, వార్డు సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో అప్పాల జలపతిని ఉపసర్పంచిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జలపతి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజన్న స్వామికి ప్రీతికరమైన కోడె మొక్కులతో పాటు, భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. “అందరినీ చల్లగా చూడు రాజన్నా” అంటూ భక్తజనం వేడుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
MLG: కేంద్ర మాజీమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ మృతి పట్ల మంత్రి డా.దనసరి అనసూయ (సీతక్క) ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ కేబినెట్లో శివరాజ్ పాటిల్ కీలక బాధ్యతలను నిర్వర్తించారని సీతక్క గుర్తుచేశారు. దేశ పార్లమెంటరీ చరిత్రలో లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పోషించిన పాత్ర అత్యంత ప్రశంసనీయం పేర్కొన్నారు.
MBNR: అడ్డాకల్ మండలం కందూరు గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, మండల అధ్యక్షుడు రమేష్ సతీమణి రాధా రమేష్‌కు మద్దతుగా జిల్లా మాజీ కార్యదర్శి నారాయణరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేసి రాధా రమేష్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రతి గ్రామంలోనూ బీజేపీ సర్పంచులు ఉండాలని నారాయణరెడ్డి ఆకాంక్షించారు.
WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ భద్రకాళి ఆలయాన్ని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు MLA తెలిపారు.
GDWL: అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 1,34,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.
GDWL: గద్వాల నియోజకవర్గ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం మల్దకల్ మండలంలోని పెద్దపల్లి, పాల్వాయి, మల్లెం దొడ్డి, విఠలాపురం గ్రామాలలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా, ఐక్యతతో పనిచేస్తేనే గ్రామం ప్రగతి బాట పడుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందుతానే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మొన్నప్ప గుట్టలో శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
JGL: డిప్యూటీ DMHOగా పదోన్నతి పొందిన జైపాల్ రెడ్డి మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ డాక్టర్ వాహిని, సిబ్బంది ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. రోగులకు అందుతున్న సేవలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి, ఆరోగ్య సూచికలను సమీక్షించారు. ఏఎన్ఎం లచ్చమ్మపై అందిన ఫిర్యాదుపై విచారణ కూడా నిర్వహించారు.
SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, సైదాపూర్ మండలాల్లో ఈనెల 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. హుస్నాబాద్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మీ గౌరవం పెరిగేలా చేస్తా అని అన్నారు.