ADB: జన్నారం మండలంలోని టీజీ పల్లి గ్రామానికి చెందిన మాదంశెట్టి అశోక్ కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం జన్నారం మండల నాయకులు రూ.1.07 లక్షల ఫిక్స్ డిపాజిట్ బాండ్లను అందించారు. అశోక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జన్నారం దండేపల్లి ఆర్యవైశ్య సంఘం నాయకులు కులస్తులు విరాళాలను సేకరించి రూ.1.07 లక్షల బాండ్లను అశోక్ కుటుంబానికి అందించారు.
KMR: కామారెడ్డి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు, కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. షబ్బీర్ అలీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.
MBNR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ఎక్లాస్ ఖాన్‌పేట్‌లో నిర్వహించే ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొననున్నారు. అనంతరం కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు గదుల భూమి పూజ చేయనున్నారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసులో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
JN: పాలకుర్తి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి నవతెలంగాణ 2025 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నవతెలంగాణ పత్రిక సమాజానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో ముందుంటుందని, ప్రజా సమస్యలను ప్రజాస్వామ్య విధానాల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
NLG: సీపీఐ పార్టీ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పద్మ, కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమరుల ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ADB: పట్టణంలోని బీసీ సంఘ భవనంలో పీఆర్టీయు తెలంగాణ సంఘం నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాధ్యక్షుడు నూర్ సింగ్ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల స్థానంలో ఇస్తున్న డిప్యూటేషన్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ADB: తలమడుగు మండలం కుచులాపూర్‌లో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కోరారు. ఎమ్మెల్యే స్పందించి గ్రామంలో 5 హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. వీటిని స్థానికులు గురువారం రాత్రి ప్రారంభించారు. గ్రామస్థుల ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
JN: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) వేం నరేందర్ రెడ్డిని వారి నివాసంలో గురువారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వేం నరేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
PDPL: పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంయుక్త, స్వర్ణలతలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ డాక్టర్ వేల్పుల సురేందర్ గురువారం తెలిపారు. ఈనెల 27 నుండి 30 వరకు హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు బయలుదేరారు.
ఖమ్మం: శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రంజిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి 7వ డివిజన్ టేకులపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. తదనంతరం సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం కప్ పోటీల్లో భాగంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంటు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నివాసంలో శాలివాహన, అరెకటిక సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా కులవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు, తీసుకొచ్చారు.
HYD: మాదాపూర్ జోన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని ట్రాఫిక్ DCP సాయి మనోహర్ తెలిపారు. మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ASF: అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ నీరజ్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
HYD: అయ్యప్ప భక్తులను అవమానించి అనుచితంగా వ్యాఖ్యానాలు చేసిన ఎస్సై అశోక్ సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసులు రెడ్డికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, అయ్యప్ప భక్త బృందం వినతి పత్రం అందజేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములను దూషించాడంతో వారు ఫిర్యాదు చేశారు.
SRPT: కేంద్రంలోని బీజేపీ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు చేపట్టవాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. గురువారం సూర్యాపేటలో సీపీఐ 100వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఉస్తెల సృజన ఉన్నారు.