SRD: హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో వేలం పాటలో పాల్గొనాలని ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపారు.
SRCL: కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయిందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశం మరువలేనివన్నారు.
MDK: ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏడుపాయల చెక్ డ్యామ్ వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. కుచన్ పల్లికి చెందిన వెంకటి(43) గురువారం విందు నిమిత్తం ఏడుపాయలకు కుటుంబీకులతో కలిసి వచ్చారు. చెక్ డ్యామ్‌లో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం లభ్యమైంది.
SRCL: ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లిలో గురువారం రాత్రి ‘మీకోసం పోలీస్’ కార్యక్రమాన్ని ఎస్సై గణేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్‌స్పైక్టర్ మొగిలి హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. మూఢనమ్మకాలపై ప్రతి ఒక్కరు అవగాహనతో ఉండాలన్నారు.
BDK: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల(DEC) 31 నుంచి జనవరి 10 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు-2024-25 ఉన్న నేపథ్యంలో నిత్య కళ్యాణాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తిరిగి జనవరి 11 నుంచి భద్రాద్రిలో నిత్య కళ్యాణాలు పునః ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
సంగారెడ్డి: గుమ్మడిదల పోలీసులు గతవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని సంగారెడ్డి కోర్టులో గురువారం హాజరు పర్చగా న్యాయమూర్తి ముగ్గురికి రూ.1,500 చొప్పున మొత్తం రూ. 4500 జరిమానా విధించారు. ఇందులో ఒకరికి 2 రోజుల జైలు శిక్ష విధించారని గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు.
WGL: రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున:ప్రారంభం కానుంది. శుక్రవారం మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
KMM: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆశ వర్కర్లు చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మంకు చేరుకున్న నేపథ్యంలో వారికి తమ్మినేని సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
BHPL: రేగొండ పోలీస్ స్టేషన్‌ను భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో వివిధ రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులకు త్వరగా స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
NZB: రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డి పోటీలకు భీంగల్ మండలం గంగారై తండాకి చెందిన మలావత్ ప్రకాష్ ఎంపికయ్యాడు. ఈరోజు నుంచి 30 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించే సీఎం కప్ పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారుడు జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రకాష్‌ను అభినందించారు.
KNR: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని AIMS హాస్పిటల్లో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన మృతి పట్ల ‘X’ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ‘మన్మోహన్ సింగ్ ప్రాయమైన అంకితభావాన్ని ప్రత్యక్షంగా చూసాను. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఆయనతో దిగిన ఫోటో షేర్ చేశారు.
NZB: భీమగల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో శుక్రవారం ద్విచక్ర వాహనాల వేలం నిర్వహించనున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేణు మాధవరావు తెలిపారు. జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు భీమ్‌గల్ పరిధిలో ఒక కేసులో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలు వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద జరిగే వేలంలో పాల్గొనాలన్నారు.
KMM: జిల్లాలోని డైట్ కళాశాలకు మహార్ధశ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో.. డైట్ కళాశాల అభివృద్ధికి మంత్రి తుమ్మల దృష్టి సారించారు. కాగా రూ.8.62 కోట్లతో డైట్ కళాశాలలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
MLG: జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మె 17వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా గురువారం సమగ్ర ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే విధంగానే తమకు సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 28న నల్గొండలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్‌లు తెలిపారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ర్యాలీ నిర్వహిస్తామన్నారు.