ADB: బోథ్ మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్య అభ్యసిస్తూ విద్యా సంవత్సరం పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసిన విద్యార్థులు 2, 4, 6వ సెమిస్టర్లలో రీ అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జనవరి 3లోగా కళాశాలలో సంప్రదించి కాకతీయ విశ్వవిద్యాలయం రీ అడ్మిషన్ అనుమతి పొంది విద్యను కొనసాగించవచ్చన్నారు.
HYD: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(TGANB) ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. కేవలం మాదకద్రవ్యాల సంబంధ కేసుల కోసమే ఏర్పాటైన ఈ విభాగం కార్యకలాపాలు అన్ని జిల్లాల్లో కొనసాగేలా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు రీజియన్లను గుర్తించి నార్కొటిక్స్ కంట్రోల్ సెల్స్‌ను ఏర్పాటు చేశారు.
మేడ్చల్: మూడుచింతల పల్లి కొల్తూరుకు చెందిన గణేశ్ (25) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం.. గురువారం సాయంత్రం డ్యూటీ అనంతరం బైక్ పై ఇంటికి వెళుతున్నాడు. శామీర్ పేట PS పరిధిలో కేశవరం సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
WGL: మామునూరు టీజీఎస్పీ 4వ బెటాలియన్ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 457 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కమాండెంట్ రామ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ హాజరవుతారన్నారు.
MDK: రామాయంపేట పట్టణంలో ప్రతిఏటా నిర్వహించే ఆర్పీఎల్ క్రికెట్ టోర్నీ జనవరి 8 నుంచి ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు మల్లేష్, ఉమామహేశ్వర్ తెలిపారు. జనవరి 8న ప్రారంభమై 19న ముగుస్తుందన్నారు. ఐపీఎల్ తరహాలో ప్రత్యక్ష ప్రసారంతో పాటు అన్ని హంగులతో టోర్నీ కొనసాగుతుందన్నారు. టోర్నమెంట్లో పాల్గొనదలచిన టీంలు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
HYD: ఆడపిల్లలు, చిన్నారులను గౌరవించకున్నా పర్వాలేదు కానీ అగౌరవపరిచి హింసకు గురిచేస్తే చట్ట ప్రకారం జైలు కెళ్లడం ఖాయమని HYDలోని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈరోజు ఓ గార్డెన్‌లో మహిళల మానసిక హింస, పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడపిల్లలు నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే చదువుకోవాలని తద్వారా చట్టాల గురించి తెలుస్తుందన్నారు.
NRML: వివిధ సమస్యల పరిష్కారానికి పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. గురువారం సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను వారు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను చూశారు. వారు మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడాలని సూచించారు.
NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్, విద్యానగర్ వీధుల్లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహిస్తారని అన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజలో పాల్గొంటారు. అలాగే ఇంద్రవెల్లి మండలంలోని ధనోరాలో కొమరం భీమ్ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొంటారన్నారు.
NRML: కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యా లయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను ఓ ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్‌మెన్లు, టీచింగ్ స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.
MNCL: సింగరేణి కార్మికుల సొంతింటి కల త్వరలో సాకారం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి ఛైర్మన్ ఇంటాక్ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అలవెన్స్‌లపై ఐటీ రద్దు తదితర సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
NRPT: నారాయణపేట మార్కెట్ యార్డుకు నాబార్డ్ నిధులు కేటాయించాలని గురువారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి వినతి పత్రం అందజేశారు. మార్కెట్ యార్డులో పది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేలా గోదాం నిర్మాణానికి నాబార్డ్ నిధులు కేటాయించాలని కోరారు. సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
PDPL: రామగుండం ఎన్టీపీసీ సింధూర కాలేజ్ రోడ్డు శ్రీమయి గ్యాస్ గోదాం సమీపంలో రహదారి కల్వర్టుపై గొయ్యి పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో రామగుండం బల్దియా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మరమ్మతులు చేసి రాకపోకులకు సౌకర్యంగా చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
NLG: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో డా. బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను CPM జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. NLGలోని దొడ్డి కొమరయ్య భవనంలో గురువారం జరిగిన జిల్లా CPM మండల కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ.. అత్యుత్తమ పదవిలో ఉండి అమిత్‌షా అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
GDWL: గద్వాల మండలం ధర్మవరం గ్రామ మిత్రులందరి సహకారంతో బాల్య మిత్రుడు మల్లికార్జున్ జ్ఞాపకార్థం గద్వాల జిల్లాలోని బాలసదనంలో ఉన్న పిల్లలకు గురువారం రూ.20 వేల ఖర్చుతో 48 జతలు బట్టలు, 25 స్టీల్ వాటర్ బాటిల్స్, 180 బిస్కెట్ ప్యాకెట్స్, 2 డజన్ల అరటి పండ్లు, 24 ఆపిల్ పండ్లు, 2 కేజీలు స్వీట్స్ పంపిణీ చేశారు.