KMR: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరలు నిలకడగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మటన్ కిలో రూ. 800 పలుకుతుండగా, చికెన్ కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక స్కిన్ లెస్ చికెన్ కిలో రూ. 150 వద్ద ఉంది. గత వారం నమోదైన ధరలే ఈ వారం కూడా కొనసాగుతున్నాయని, మాంసపు విక్రయాలు సాధారణంగా ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు.
MNCL: జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మండలాల పరిధిలోని 111 గ్రామ పంచాయతీలు, 996 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాసిపేట, కన్నెపల్లి మండలాల్లోని ధర్మారావుపేట, ముత్తాపూర్ సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
BHNG: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా బొమ్మలరామారం మండలం మైలారం నూతన ఉప సర్పంచ్ తత్తరి గిరి ప్రసాద్‌ను నిన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రామాలలోని పేద ప్రజల అభివృద్ధిని విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించింది అని చెప్పారు.
MNCL: వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధన నైపుణ్యాలు పెంపొందిస్తాయని ప్రిన్సిపల్ సంతోశ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లిలోని కాసిపేట బాలుర గురుకులంలో పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ‘ఇన్నోవేటర్స్ అరేనా’ అనే నేపథ్యంతో ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు, నమూనాలు, ప్రయోగాలు అందరిని ఆకట్టుకున్నాయి.
SRD: నారాయణఖేడ్ మండలం, చాప్టాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, BJP సర్పంచ్ అభ్యర్థి తిమ్మయ్య, అభ్యర్థుల విజయం కోసం మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు BJP అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని సూచించారు. ఇందులో నాయకులు మల్ రెడ్డి, సంజు రెడ్డి, రాజు, రామప్ప, ఉన్నారు.
ASF: కాగజ్ నగర్ మండలం రాంనగర్, నజ్రుల్ నగర్, బసంతినగర్ గ్రామాల్లో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. గూండాగిరి చేసేవారికి రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వవద్దని, ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.
MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వివిధ గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను, ఏర్పాటుచేసిన బందోబస్తును మెదక్ టౌన్ సీఐ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. నిజాంపేట మండలంలోని నందగోకుల్, నస్కల్, రాంపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.
HYD: బంజారాహిల్స్ పరిధిలో ఉన్న ఓ ట్యూషన్ కేంద్రంలో సరిగా చదవడం లేదన్న కారణంతో ఒకటో తరగతి చదువుతున్నటువంటి తేజ నందన్(6) అను విద్యార్థిపై ట్యూషన్ టీచర్ మానస గరిటతో తొడలు, వీపు, చేతులు, బుగ్గలు వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో ఏడుస్తూ ఇంటికెళ్లిన బాలుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఉమ్మడి జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 613 గ్రామ పంచాయతీల గానూ, 71 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 542 జీపీలకు నేడు పోలింగ్ జరగనుంది. నల్గొండ- 10 మండలాల్లోని 244, సూర్యాపేట- 8 మండలాల్లోని 158, యాదాద్రి- 5 మండలాల్లోని 140 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
KMM: రఘునాథపాలెం మండలం వీ.వీ. పాలెంకు చెందిన చండ్ర రమేష్‌కు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంటను ధ్వంసం చేసినట్లు అందిన ఫిర్యాదుపై సీఐ ఉస్మాన్ షరీఫ్ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన కుతుంబాకు రాంప్రసాద్ తన పంటను దున్నించి ధ్వంసం చేశాడని రమేష్ నిన్న ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మెదక్ జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రజలు, సిబ్బంది సహకరించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. శనివారం చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
PDPL: తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డాక్టర్ సువర్ణ, ఐఎఫ్ఎస్ శనివారం రామగుండం-3 ఏరియాలో పర్యటించారు. రామగిరి అతిథి గృహంలో ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఓసీపీ-2 ఉపరితల గనిని సందర్శించి, మొక్కను నాటారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి అవసరమైన అటవీశాఖ భూముల విషయంలో సహకారం అందించాలని జీఎం కోరారు.
SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యసాయి గురుకుల విద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని, గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిరేకల్ నియోజక వర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్, ఎస్పీలు నోరు మొదపడటంలేదని నకిరేకల్ మాజీ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఆయన స్థానిక బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 34 కేంద్రాలలో 11:30 నుండి 1:30 వరకు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 6812 మంది అభ్యర్థులకు గాను 5113 మంది పరీక్షకు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, విద్యా శాఖ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.