SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న కోదాడలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు సేవ చేసే నాయకులను సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సూచించారు.
NRPT: ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పోలింగ్ అధికారులకు సూచించారు. శనివారం ఆమె నారాయణపేట మండలం జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఇది సమస్యాత్మక కేంద్రం కావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా అని ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు.
HYD: బంజారాహిల్స్‌లోని KBR పార్క్, నేచర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వాకర్లకు బ్రిస్క్ వాక్ పోటీలు పెట్టారు. ఇవాళ ఉదయం ఐఎఫ్ఎస్ అధికారిని ప్రియాంక వర్గీస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. వాకర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
MBNR: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ క్రింది విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 212 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 240 నుంచి రూ. 250 ఉందని వ్యాపారులు వెల్లడించారు. ప్రాంతాలను బట్టి రేట్లలో మార్పులుంటాయన్నారు.
NZB: సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్ లేదా 100 డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
NRML: దిలావర్పూర్ మండలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గతంలో పనిచేసి, నేడు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రోసిడింగ్ అధికారిగా దిలావర్పూర్ మండలానికి చెందిన నంద అనిల్ విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవి కాలం ముగిసిన వెంటనే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమై గత సంవత్సరం సోషల్ టీచర్‌గా ప్రభుత్వ కొలువును సాధించారు. దీంతో పలువురు వీరిని అభినందించారు.
SRPT: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పూర్తిగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాల్సిందిగా సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం రాత్రి చివ్వెంల మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.
HYD: లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. లంగర్‌హౌస్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నిన్న రాత్రి 5 లీటర్ల హ్యాష్ ఆయిల్, 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సొత్తు విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అంచనా, ఈ కేసులో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
MHBD: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడ మండలం గుంజేడు శ్రీ ముసలమ్మ తల్లిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కొనసాగడానికి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులను గెలిపించాలన్నారు.
SRPT: కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అమరావతి, కోదాడ, సూర్యాపేట గుండా వెళ్లనుంది. ఈ మెగా ప్రాజెక్టుతో కోదాడకు వేగవంతమైన రవాణా సౌకర్యం లభించనుంది. స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
KMR: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరలు నిలకడగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మటన్ కిలో రూ. 800 పలుకుతుండగా, చికెన్ కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక స్కిన్ లెస్ చికెన్ కిలో రూ. 150 వద్ద ఉంది. గత వారం నమోదైన ధరలే ఈ వారం కూడా కొనసాగుతున్నాయని, మాంసపు విక్రయాలు సాధారణంగా ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు.
MNCL: జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మండలాల పరిధిలోని 111 గ్రామ పంచాయతీలు, 996 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాసిపేట, కన్నెపల్లి మండలాల్లోని ధర్మారావుపేట, ముత్తాపూర్ సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
BHNG: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా బొమ్మలరామారం మండలం మైలారం నూతన ఉప సర్పంచ్ తత్తరి గిరి ప్రసాద్‌ను నిన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రామాలలోని పేద ప్రజల అభివృద్ధిని విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించింది అని చెప్పారు.
MNCL: వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధన నైపుణ్యాలు పెంపొందిస్తాయని ప్రిన్సిపల్ సంతోశ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లిలోని కాసిపేట బాలుర గురుకులంలో పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ‘ఇన్నోవేటర్స్ అరేనా’ అనే నేపథ్యంతో ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు, నమూనాలు, ప్రయోగాలు అందరిని ఆకట్టుకున్నాయి.
SRD: నారాయణఖేడ్ మండలం, చాప్టాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, BJP సర్పంచ్ అభ్యర్థి తిమ్మయ్య, అభ్యర్థుల విజయం కోసం మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు BJP అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని సూచించారు. ఇందులో నాయకులు మల్ రెడ్డి, సంజు రెడ్డి, రాజు, రామప్ప, ఉన్నారు.