NLG: MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్ను డా. ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.
VKB: ధారూర్ మండల పరిధిలోని నాగారంలో సీనియర్ నాయకులు జోగు అనంతయ్య భార్య భాగ్యమ్మ నాగారం నుంచి సర్పంచ్ అభ్యర్థినిగా నిలబడ్డారు. ఈ రోజు గ్రామంలోని గల్లీలలో నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. రింగు గుర్తును ఓటు వేసి తనకు గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, సులేమాన్, బాలయ్య, రమేష్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
BDK: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మొదటి విడత పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను పోలింగ్ అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను ప్రతి కేంద్రాలలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
ASF: ఆసిఫాబాద్ మండలం రాజంపేట సర్పంచ్ అభ్యర్థి బుర్స పోచయ్య, ఇతర వార్డ్ మెంబర్స్ అభ్యర్థులకు మద్దతుగా MLA కోవ లక్ష్మి గురువారం ప్రచారం చేశారు. MLA ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిశారు. BRS ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను వివరంగా వివరించారు. BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.
BHPL: జిల్లాలో మొదటి విడత GP ఎన్నికలకు సమయం ముగిసిన విషయం తెలిసిందే. అయితే మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం 77.5%, కొత్తపల్లిగోరి 84.82%, రేగొండ 84.26%, మొగుళ్లపల్లి 84.8% పోలింగ్ నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. మొత్తం 1,07,690 మంది ఓటర్లలో 88,588 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.
KNR: వీణవంక మండల కేంద్రంలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీడీవో, ఎస్సై పలు సూచనలు చేశారు. అభ్యర్థులు గిఫ్ట్, ఓటర్లను ఆకర్షించే వస్తువులను ఇచ్చిన ఇతరులను కించపరిచే విధంగా పోస్ట్ పెట్టినా, మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు . ఒక్క సర్పంచ్ అభ్యర్థి కూడా హాజరు కాకపోవడం విడ్డూరమని అధికారులన్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంట నమోదైన ఓటింగ్ శాతం వివరాలను జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ 70.38%, సిరికొండ 85.12%, ఇంద్రవెల్లి 57.60%, ఉట్నూర్ 65.95%, నార్నూర్ 78.22%, గాదిగూడలో 78.18% నమోదైంది. సరాసరి ఓటింగ్ 69.10% నమోదైందని అన్నారు.
జగిత్యాల జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిగా శాంతియుత వాతావరణంలో ముగిసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
RR: గచ్చిబౌలి స్టేడియంలో శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మానియా- 2025 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు MEO వెంకటయ్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు 3-దఫాలుగా 2వ ఆర్డినరీ ఎలక్షన్స్ నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల అధికారి ప్రకటించారు. మీ సంస్థలలో పనిచేసే కార్మికులకు 11, 14& 17 తేదీలలో (సంబంధిత మండలాలలో పోలింగ్ రోజున) వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులందరికి తెలియజేశారు.
MBNR: హన్వాడలోని సల్లోనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అతినమోని అనితకు మద్దతుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సల్లోనిపల్లి గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అనితను ఆశీర్వదించి, గెలిపించాలని కోరారు.
NZB: నిజాంసాగర్ మండలంలో నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మొత్తం 5124 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్నారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉ. 11:30 నుంచి మ.1:30గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం షేక్ పల్లి గ్రామంలో రెండవ దశ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అందుతుందని వెల్లడించారు. సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నట్టయితే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.
HYD: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా, సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్‌లోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారన్నారు.