నిర్మల్: కిస్టాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి పర్యటించనున్నట్లు అసెంబ్లీ కన్వీనర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఎన్నుకున్న 201 బూత్ కమిటీ సభ్యులను సన్మానించనున్నారు.
KNR: గోదావరిఖని RTC డిపో ఆవరణలో పాముల సంచారంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపో చుట్టూ ఉన్న ప్రహరీ అవతల చెత్తాచెదారం ఉండటంతో పాములు తిరుగుతున్నాయి. ఇటీవల ఒకరికి పాము కాటు వేయడంతో చికిత్స పొందుతున్నారు. డిపో ఆవరణలో ఇనుప తుక్కు ఉండటం వల్ల పాములు అధికమవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాయని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
SDPT: సికింద్రాబాద్ అశోక్ నగర్ టక్కర బస్తీలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
HNK: ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి ఆశీర్వాదం ఇచ్చారు.
MNCL: జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు నూతన బల్బులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరారు. జన్నారం పట్టణం నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉంది. ఆ రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు చాలా కాలం క్రితం విద్యుత్ బల్బులు బిగించారు. వాటిలో చాలా వరకు కాలిపోగా, మరికొన్ని వెలగడం లేదు. ఆ స్తంభాలకు నూతన బల్బులు ఏర్పాటు చేయాలన్నారు.
JGL: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు ప్రజెంటేషన్ భాగంగా జగిత్యాల పట్టణానికి చెందిన సామాజికవేత్త బీరెల్లి స్వప్నకు 15వ స్థానం లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానేపల్లి జ్యువెలర్స్, వారాహి సిల్మ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్య ఉమెన్ అవార్డును స్వప్నకు గురువారం అందజేశారు.
కామారెడ్డి: పట్టణంలోని ఓ స్వీట్ హోమ్‌లో స్వీట్లలో స్కబ్బర్ వచ్చిందని ఈనెల 24వ తేదిన ఫిర్యాదు వచ్చిందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ప్రముఖ స్వీట్ హౌస్‌ని తనిఖీ చేశారు. కొన్ని అనుమానిత నమూనాలు సేకరించి ల్యాబ్‌కి పంపించినట్లు చెప్పారు. ఇటువంటి తప్పిధాలు జరగకుండా ఉండాలని స్వీట్ హోమ్ యజమానులను హెచ్చరించారు.
NRML: సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహించే కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా ప్రభుత్వంతో పోరాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలో జాప్యం చేయడంతో సమ్మెను ఉధృతం చేసే క్రమంలో బోధన బోధనేతర సిబ్బంది శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగారు. దీంతో విద్యాబోధన నిలిచిపోనుంది.
WGL: బైకును కారు ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్‌కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందాడు.
KMM: ఉమ్మడి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంఛార్జి దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా మంత్రి పొంగులేటి అధికార పర్యటన వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.
NGKL: కొల్లాపూర్ మండలంలోని సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌లో స్పీడ్ బోట్లు ఏర్పాటు చేస్తామని పర్యాటకశాఖ జిల్లా అధికారి నర్సింహ చెప్పారు. గురువారం దేవస్థానం అధికారి జైపాల్ రెడ్డితో కలిసి రిజర్వాయర్‌ను సందర్శించారు.
HYD: ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు.
HYD: కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన జీవో నెం 60 ప్రకారం వారికి జీత భత్యాలు చెల్లించడంతో పాటు రూ. 10 లక్షల జీవిత బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
KMM: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.
కామారెడ్డి: జిల్లా న్యాయాధికారి సేవ సంస్థ(DLSA) ఆధ్వర్యంలో ఇటీవలే OMR బేస్డ్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎంపికైన అర్హులకు రేపు 2 గం.లకు స్టేనో, 3.30గం.లకు టైపిస్టు పోస్టులకు కామారెడ్డిలోని RK పీజీ కళాశాలలో నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వివరాలకు వెబ్‌సైట్‌లో https://kamareddy.dcourts.gov.in సందర్శించాలన్నారు.