NRML: సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కొరకు నిరవధిక దీక్ష చేపట్టగా, ప్రభుత్వం ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునః సమీక్షించాలని ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్ శుక్రవారం ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
HYD: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన పార్థివ దేహానికి శనివారం అంత్యక్రియలు జరుగుతాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని విలేకరులతో వేణుగోపాల్ అన్నారు.
HYD: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటు రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పూర్తయిన వాటితో పాటు వివిధ దశల్లో ఉన్నవి పూర్తిచేసి మొత్తం 94,204 ఇళ్లకు పట్టాలు అందించాల్సి ఉండగా వాటిని కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా ఎంపిక చేసిన వారికే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
PDPL: మంథని మండలం గుంజపడుగు గ్రామ చిన్న బస్టాండు వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన బొజ్జల రమేష్ గోదావరిఖని నుంచి మంథని వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొనడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో 108లో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: నార్కట్ పల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గం.కు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తన చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 50 మంది లబ్దిదారులకు అందజేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మండలంలోని లబ్దిదారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
MNCL: ప్రస్తుత కాలంలో సెల్ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు.
ఖమ్మం: నేలకొండపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చామని.. అకాల వర్షంతో పంట తడిచిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
HYD: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు.
NRML: మామడ మండలం పరిమండల్ గ్రామంలోని భీమన్న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని అన్నారు. వీరి వెంట స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
NRML: సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి గురువారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటించాలని సూచించారు. ఇందులో సోను సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన వంశీ, మెట్‌పల్లిలోని వర్షకొండ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న జెట్టిపల్లి అశోక్ ఎంపికయ్యారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో గత ఆదివారం జరిగిన సెలెక్షన్ అండ్ ట్రయల్స్‌లో సీనియర్ పురుషుల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి వీరు జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ టీంకు ఎంపికయ్యారు.
JN: మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసిన ఆయన సేవలు అపారమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ వంటి మహా నాయకుడు ఈ లోకాన్ని విడిచిపోవడం దేశానికి తీరని నష్టమని అన్నారు.
ADB: బోథ్ మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్య అభ్యసిస్తూ విద్యా సంవత్సరం పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసిన విద్యార్థులు 2, 4, 6వ సెమిస్టర్లలో రీ అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జనవరి 3లోగా కళాశాలలో సంప్రదించి కాకతీయ విశ్వవిద్యాలయం రీ అడ్మిషన్ అనుమతి పొంది విద్యను కొనసాగించవచ్చన్నారు.
HYD: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(TGANB) ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. కేవలం మాదకద్రవ్యాల సంబంధ కేసుల కోసమే ఏర్పాటైన ఈ విభాగం కార్యకలాపాలు అన్ని జిల్లాల్లో కొనసాగేలా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు రీజియన్లను గుర్తించి నార్కొటిక్స్ కంట్రోల్ సెల్స్‌ను ఏర్పాటు చేశారు.