• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేషనల్ అవార్డుకు ఎంపికైన ఇన్‌కమ్ టాక్స్ ఆడిటర్

PDPL: జనగామ గ్రామానికి చెందిన ఇన్‌కమ్ టాక్స్ ఆడిటర్ MD ఇబ్రహీం BR అంబేద్కర్ నేషనల్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు డా మనీష్ గవాయి, ప్రియాంక సాతే తెలిపారు. Jan 3న క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఈ అవార్డును అందించనున్నట్లు పేర్కొన్నారు.

December 27, 2024 / 04:56 AM IST

యాదగిరిగుట్ట శ్రీవారి నిత్య ఆదాయం

BNR: యాదగిరిగుట్ట శ్రీవారి ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, సువర్ణపుష్పార్చన, యాదరుషి నిలయం, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.40,30,791 ఆదాయం వచ్చిందన్నారు.

December 27, 2024 / 04:55 AM IST

కెమికల్స్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కరపత్రాలు విడుదల

NRPT: మరికల్ మండలం చిత్తనూరులోని ఇథనాల్ కంపెనీలో ఏర్పాటు చేస్తున్న సింథటిక్ కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే నిలిపివేయాలని ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ప్రొఫెసర్ హరగోపాల్ చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. సింథటిక్, ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల 23 గ్రామాలకు నష్టం కలిగించే అవకాశం ఉందని అన్నారు.

December 27, 2024 / 04:53 AM IST

గురుద్వారాలో వీర్ బాల్ దివస్

HYD: సికింద్రాబాద్ గురుద్వారాలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, మన స్వేచ్ఛ కోసం వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణాలు అర్పించారని, వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం అని తెలిపారు.

December 27, 2024 / 04:50 AM IST

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీపై పోలీసుల క్లారిటీ

హైదరాబాద్: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీపై పోలీసులు గురువారం క్లారిటీ ఇచ్చారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పై ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు అన్నారు. అనుమానాలుంటే టోలీ నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

December 27, 2024 / 04:48 AM IST

సీఎంఆర్ వడ్లు చోరీ.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

GDWL: ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్లు గోదాంలో నిల్వ ఉంచిన సీఎంఆర్ వడ్లు దాదాపు 300 బస్తాలు చోరీకి గురయ్యాయి. ఈ విషయమై సాయి గోపాల్ ఇంటెక్ ప్లాంట్ యజమాని హరినాథ్ ఇటిక్యాల పీఎస్‌లో ఈనెల 25న ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఇటిక్యాల పోలీసులు గోదాంను సందర్శించి పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

December 27, 2024 / 04:48 AM IST

నేడు జిల్లాలో కేంద్ర మంత్రి , ఎంపీ డీకే అరుణ పర్యటన

GDWL: జిల్లాకు నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ వస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి గురువారం పేర్కొన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గట్టు మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు సమీక్షిస్తారని తెలిపారు. అలాగే 3 గంటలకు కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ చేస్తారని తెలిపారు. పర్యటనను బీజేపీ నాయకులు విజయవంతం చేయాలని కోరారు.

December 27, 2024 / 04:47 AM IST

డిజిటల్ యుగంలోను బుక్స్‌కు అద్భుత ఆదరణ

HYD: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రదర్శన కొనసాగుతుంది. గతంలో కంటే ఈసారి నిర్వాహకులు ఎక్కువ స్థాయిలో స్టాళ్లు ఏర్పాటు చేయడం, పబ్లిషర్స్ సంఖ్య కూడా పెరగడంతో పుస్తక ప్రియులు, సాహితీ వేత్తలు బుక్ ఫెయిర్‌కు భారీగా క్యూ కడుతున్నారని నిర్వాహకులు తెలిపారు.

December 27, 2024 / 04:42 AM IST

‘ప్రజా దర్బార్ సమస్యలకు పరిష్కారం’

HYD: ప్రజా దర్బార్‌తో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలను ఎమ్మెల్యే కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న కార్పోరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

December 27, 2024 / 04:40 AM IST

నేటి నుంచి జిల్లాలో సీఎం కప్ రాష్ట్రస్థాయి జూడో పోటీలు

KNR: జిల్లాలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఈరోజు నుండి 3రోజుల పాటు సీఎం కప్ రాష్ట్రస్థాయి జూడో పోటీలను నిర్వహిస్తున్నట్లు, జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వనుండగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు రానున్నారు.

December 27, 2024 / 04:32 AM IST

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : ఎమ్మెల్యే

మేడ్చల్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు వచ్చి ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. వివిధ విభాగాల అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

December 27, 2024 / 04:30 AM IST

నిరుపేద అమ్మాయి వివాహానికి పుస్తే మట్టెలు అందజేత

JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేట్ గ్రామంలో నివసిస్తున్న గడ్డం చిన్ను D/o భూమన్న వారిది నిరుపేద కుంటుంబమని సమాచారం తెలుసుకున్న ట్రస్టువారు ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గురువారం పేదింటి అమ్మాయి వివాహం పెళ్లికి కావాల్సిన పుస్తే మట్టెలు, పట్టుచీర కానుకగా అందించారు. కార్యక్రమంలో పలువురు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

December 27, 2024 / 04:27 AM IST

దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో అధికారుల పర్యటన

NRML: కడెం మండలంలోని దోస్తు నగర్ అటవీ ప్రాంతంలో ట్రైనీ బీట్ అధికారులు పర్యటించారు. హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బీట్ అధికారులు గురువారం కడెం మండలంలోని దోస్తు నగర్ నుంచి మైసంపేట్ పునరావాస కేంద్ర కాలనీ వరకు నడిచారు. వారికి అటవీ సంరక్షణ, అధికారుల విధులు, తదితర అంశాలపై అటవీ అధికారులు అవగాహన కల్పించారు.

December 27, 2024 / 04:26 AM IST

కార్వాన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం: ఎమ్మెల్యే

HYD: కార్వాన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్ధీన్ అన్నారు. టోలిచౌకీ, నానల్ నగర్, లంగర్ హౌస్, కార్వాన్ తదితర డివిజన్ల నుంచి పలు సంఘాల వారు గురువారం ఆయనను మెరాజ్ కాలనీలోని తన కార్యాలయంలో కలిసి సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

December 27, 2024 / 04:24 AM IST

జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థికి ఎంపీ సన్మానం

మెదక్: తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన విద్యార్థి పవిత్ర జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడంతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సన్మానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో అండర్-14 విభాగంలో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపిక కావడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

December 27, 2024 / 04:22 AM IST