• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఖోఖో ఛాంపియన్‌షిప్ నిర్వహణకు రూ. 5 లక్షల విరాళం

WGL: గీసుగొండ హైస్కూల్లో వచ్చే నెల 8 నుంచి 11 వరకు 57వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఖోఖో ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నిర్వహణకు సామాజిక సేవకులు అల్లం స్వప్న దేవి-బాల కిశోర్ రెడ్డి దంపతులు రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరగోని రాజు కుమార్, కోట రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

December 27, 2024 / 04:00 AM IST

నాగిరెడ్డిపేటలో ఇళ్ల కూల్చివేత

NZB: రోడ్డు విస్తరణలో భాగంగా నాగిరెడ్డిపేటలో పలు ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. నాగిరెడ్డిపేట నుంచి గోపాల్‌పేట వరకు రెండు లైన్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డుపక్కన ఉన్న పాత ఇళ్లను పంచాయతీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

December 26, 2024 / 09:07 PM IST

‘సీఆర్టీల డిమాండ్లను పరిష్కరించాలి’

MLG: సీఆర్టీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గోవింద్ నాయక్ అన్నారు. ఏటూరునాగారంలో సీఆర్టీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. ఐటీడీఏ విద్యాలయాల్లో 20 ఏళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్న సీఆర్టీలను క్రమబద్ధీకరించాలన్నారు.

December 26, 2024 / 09:01 PM IST

సీతారామాలయంలో వైభవంగా సుదర్శన హోమం

జనగామ: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సీతారాముల ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని సుదర్శన హోమం నిర్వహించారు. అర్చకుడు మోహన కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. స్థానిక భక్తులు పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

December 26, 2024 / 08:59 PM IST

జవహర్ నగర్‌లో పూర్ణిమ మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్

HYD: జవహర్‌నగర్ PS పరిధిలోని న్యూ భవాని కాలనీలో పూర్ణిమ (19) అనే యువతి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమైన శివరాత్రి నిఖిల్ (21)ను ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సైదయ్య తెలిపారు. సీఐ కథనం మేరకు.. ప్రేమ పేరుతో నిఖిల్ కొన్నేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆత్మహత్యకు చేసుకుందన్నారు.

December 26, 2024 / 08:52 PM IST

రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి

NRPT: కృష్ణ, వికారాబాద్ రైల్వే లైన్ పనులు చేపట్టాలని గురువారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సీపీఎం నాయకులు నారాయణపేట కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్య దర్శి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనుకబడిన నారాయణపేట జిల్లాకు కేంద్రం నుంచి అధిక నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు.

December 26, 2024 / 08:52 PM IST

రేపు జోగులాంబ ఆలయానికి సుప్రీంకోర్టు జడ్జి రాక !

GDWL: అలంపురం జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకునేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జి ఎస్.వి.ఎన్ భట్టి వస్తున్నట్టు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. ఆయన రాక కోసం దేవస్థానం తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 12 గంటల తర్వాత ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు.

December 26, 2024 / 08:47 PM IST

తునికి నల్ల పోచమ్మ వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని నర్సాపూర్ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేలు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.

December 26, 2024 / 08:47 PM IST

‘పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను చెల్లించాలి’

MNCL: కాసీపేట మండలం దేవాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం నాయకులు CITU ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.10వేల వేతనంతో పాటు పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనం చెల్లించాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు.

December 26, 2024 / 08:44 PM IST

బాధిత కుటుంబానికి ఫిక్స్ డిపాజిట్ బాండ్లు అందజేత

ADB: జన్నారం మండలంలోని టీజీ పల్లి గ్రామానికి చెందిన మాదంశెట్టి అశోక్ కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం జన్నారం మండల నాయకులు రూ.1.07 లక్షల ఫిక్స్ డిపాజిట్ బాండ్లను అందించారు. అశోక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జన్నారం దండేపల్లి ఆర్యవైశ్య సంఘం నాయకులు కులస్తులు విరాళాలను సేకరించి రూ.1.07 లక్షల బాండ్లను అశోక్ కుటుంబానికి అందించారు.

December 26, 2024 / 08:35 PM IST

షబ్బీర్ అలీనీ కలిసిన టీఎన్జీవోస్ ప్రతినిధులు

KMR: కామారెడ్డి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు, కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. షబ్బీర్ అలీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.

December 26, 2024 / 08:33 PM IST

రేపు చెక్కుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

MBNR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ఎక్లాస్ ఖాన్‌పేట్‌లో నిర్వహించే ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొననున్నారు. అనంతరం కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు గదుల భూమి పూజ చేయనున్నారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసులో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

December 26, 2024 / 08:31 PM IST

నవ తెలంగాణ క్యాలెండర్‌ను ఆవిష్కరించి ఝాన్సీ రెడ్డి

JN: పాలకుర్తి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి నవతెలంగాణ 2025 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నవతెలంగాణ పత్రిక సమాజానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో ముందుంటుందని, ప్రజా సమస్యలను ప్రజాస్వామ్య విధానాల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

December 26, 2024 / 08:29 PM IST

హుజూర్‌ నగర్‌లో సీపీఐ ఆవిర్భావ వేడుకలు

NLG: సీపీఐ పార్టీ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పద్మ, కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమరుల ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

December 26, 2024 / 08:27 PM IST

‘ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి’

ADB: పట్టణంలోని బీసీ సంఘ భవనంలో పీఆర్టీయు తెలంగాణ సంఘం నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాధ్యక్షుడు నూర్ సింగ్ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల స్థానంలో ఇస్తున్న డిప్యూటేషన్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

December 26, 2024 / 08:24 PM IST