NZB: రోడ్డు విస్తరణలో భాగంగా నాగిరెడ్డిపేటలో పలు ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. నాగిరెడ్డిపేట నుంచి గోపాల్పేట వరకు రెండు లైన్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డుపక్కన ఉన్న పాత ఇళ్లను పంచాయతీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.