PDPL: స్థానిక ఆర్సీఓఏ క్లబ్లో గోదావరి కళా సంఘాల సమాఖ్య 37వ వార్షికోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కళోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళలకు పుట్టినిల్లుగా పేరున్న గోదావరిఖనిలో కళా భవనం నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవ చూపాలని గోదావరిఖని కళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు విన్నవించారు.