• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వాటర్ ట్యాంకును ఎక్కిన వృద్ధురాలు

KMM: ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గురువారం వృద్దురాలు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేసింది. చేతి కర్ర సహాయంతో వాటర్ ట్యాంక్ ఎక్కటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. గమనించిన స్థానికుడు వెంకటేష్ వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వృద్దురాలను కాపాడారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 11, 2025 / 12:11 PM IST

వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చిన 90 ఏళ్ల వృద్ధురాలు

WGL: రాయపర్తి మండలం రాగన్నగూడెంలో 90 ఏళ్ల వృద్ధురాలు భద్రమ్మ వీల్ చైర్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేక ఏర్పాట్లతో తీసుకొస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న భద్రమ్మ చర్యకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

December 11, 2025 / 12:10 PM IST

కనుకుంటా పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

SRD: గుమ్మడిదల మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా పరితోష్ పంకజ్ పరిశీలించారు. మండల పరిధిలోని కానుకుంట, నల్ల వల్లి తదితర పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తనిఖీ చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు ఆయన సూచించారు.

December 11, 2025 / 12:03 PM IST

11 గంటల వరకు ఎంత పోలింగ్ జరిగిందంటే..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం మొదట విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఉదయం 11 గంటలకు వరకు రాయపర్తిలో 59.78%, వర్ధన్నపేటలో 57.45%, పర్వతగిరిలో 65.57% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లు బారులు తీర్చి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. శాంతియుతంగా పోలింగ్ జరుగుతుంది.

December 11, 2025 / 12:00 PM IST

రేపు HYDకు యూపీ మాజీ సీఎం

HYD: యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రేపు నగరంలో సందడి చేయనున్నారు. పలుకార్యక్రమాల్లో పాల్గొనేందుకు అఖిలేశ్ శుక్రవారం సిటీకి వస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులతో సమావేశమవుతారన్నారు. ముఖ్యంగా ఓట్ చోరీ గురించి మాట్లాడే అవకాశముందన్నారు. అలాగే శనివారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సమ్మిట్‌కు రానున్నారు.

December 11, 2025 / 11:59 AM IST

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మెదక్ RDO.!

MDK: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అల్లాదుర్గం మండలంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. పోలింగ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

December 11, 2025 / 11:59 AM IST

ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువత

ADB: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యువత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వివిధ పట్టణాలకు పనుల నిమిత్తం వెళ్లిన యువకులు ఓటు వేయడానికి తిరిగి సొంతూర్లకు వచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరు వినియోగించాలని నార్నూర్ మహర్ బెటాలియన్ అధ్యక్షుడు జాడే భీంరావు పేర్కొన్నారు.

December 11, 2025 / 11:58 AM IST

వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ పై నిఘా: జిల్లా కలెక్టర్

KMM: జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా మొదటి విడత 7 గ్రామపంచాయతీలో జరిగే పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

December 11, 2025 / 11:58 AM IST

జిల్లాలో 54.78 శాతం పోలింగ్ నమోదు

GDWL: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయానికి జిల్లాలో సగటున 54.78 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. ధరూర్ 56.74%, గద్వాల 47.93%, గట్టు 51.61%, కేటీదొడ్డి 65.88% పోలింగ్ జరిగింది.

December 11, 2025 / 11:57 AM IST

పోలింగ్ ఎంత నమోదు అయిందంటే!

KMM: జిల్లాలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాలు) ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 52.25% పోలింగ్ నమోదైంది. బోనకల్-59.43%, చింతకాని- 59.82%, కొణిజర్ల -41.39%, మధిర- 52.84%, రఘునాథపాలెం- 67.58%, వైరా- 34.42%, ఎర్రుపాలెం- 46.5% పోలింగ్ నమోదయ్యాయి. ఇప్పటివరకు (11AM) 1,25,666 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

December 11, 2025 / 11:57 AM IST

మెదక్ జిల్లాలో 56.46% ఓటింగ్

మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు 56.46% ఓటింగ్ నమోదు అయినట్లు తెలిపారు. అత్యధికంగా టేక్మాల్ మండలంలో 61.87, అల్లాదుర్గం 51.76, హవేలీ ఘన్పూర్ 60.39, పాపన్నపేట 54.91, రేగోడు 46.95, పెద్ద శంకరంపేట 59.46% ఓటింగ్ జరిగినట్లు తెలిపారు.

December 11, 2025 / 11:56 AM IST

‘అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలి’

MBNR: నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించాల్సిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలం సలోనిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, పార్టీ అభ్యర్థి అతనమోని అనితను గెలిపించాలని కోరారు. పేదల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

December 11, 2025 / 11:55 AM IST

జిల్లా వ్యాప్తంగా 58.68% ఓట్లు నమోదు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. 11 గంటల వరకు ఘనపూర్ ములుగు 51.41%, గోరి కొత్తపల్లి 64.45%, మొగుళ్ళపల్లి 57.92%, రేగొండ 63.51% జిల్లా వ్యాప్తంగా 58.68% ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు ప్రతీ క్షణం నిఘా పెట్టారు.

December 11, 2025 / 11:55 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న వంటేరు

SDPT: గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసివచ్చి గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతాప్ రెడ్డి కుమారుడు తాజా మాజీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు

December 11, 2025 / 11:54 AM IST

ఓటు వేయడానికి ముందుకు వస్తున్న వృద్ధులు

MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట, చెందారం, తదితర గ్రామాలు, దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల, ద్వారక తదితర గ్రామాలలో చాలా మంది వృద్ధులు వికలాంగులు ముందుకస్తున్నారు.

December 11, 2025 / 11:53 AM IST