• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భారీగా తగ్గిన మిర్చి ధరలు

KMM: వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,000, కొత్త మిర్చి ధర రూ.16,011గా పలికింది. అలాగే, క్వింటా పత్తి ధర రూ.7,100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజూ కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.700, కొత్త మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.100 తగ్గినట్లు తెలిపారు.

December 27, 2024 / 10:48 AM IST

‘ఫేస్ బుక్’ భారీ డీల్

HYD: ‘ఫేస్‌బుక్’ తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న ఆఫీస్ స్పేస్ కోసం నెలకు రూ.2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ.2.8కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించింది.

December 27, 2024 / 10:45 AM IST

మన్మోహన్ సింగ్ మృతి.. కూనంనేని దిగ్భ్రాంతి

KMM: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆర్థిక వేత్తగా, అధ్యాపకుడిగా, ఆర్బీఐ గవర్నర్‌గా, రాజ్య సభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానిగా ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

December 27, 2024 / 10:40 AM IST

మన్మోహన్ సింగ్ సేవలు దేశానికి మరువలేనివి: ఎంపీ

MBNR: ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ శుక్రవారం దిగ్భ్రాంతి తెలిపారు. ఈ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది అన్నారు. ఆర్థిక వేత్తగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఆయన సేవలు మరువలేనివి అన్నారు.

December 27, 2024 / 10:40 AM IST

నేడు భూసార బీట్ బంద్

NRML: భైంసా వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో భూసార బీట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని రైతులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలన్నారు.

December 27, 2024 / 10:35 AM IST

మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన వ్యాపారస్తులు

MNCL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు జన్నారం వర్తక సంఘం నాయకులు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా పట్టణంలోని వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. మన్మోహన్ చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వామన్ కుమార్, జక్కు రమేష్, కోశాధికారి శివకృష్ణ, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ సభ్యులు ఉన్నారు.

December 27, 2024 / 10:34 AM IST

ఎస్ఐ మృతితో గ్రామంలో విషాదం

MDK: కొల్చారానికి చెందిన ఎస్ఐ సాయికుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2018లో విధుల్లోకి చేరిన సాయికుమార్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, బిక్కనూరులో విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన మృతి చెందడంతో అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు.

December 27, 2024 / 10:31 AM IST

శబరిమలకు వెళ్లే రెండు రైళ్లు రద్దు

HYD: దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ శబరిమలకు వెళ్లే పలు ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా జనవరి 24న వెళ్లాల్సిన మౌలాలి – కొట్టాయం(07167), జనవరి 25న కొట్టాయం – మౌలాలి(07168) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎలాంటి బుకింగ్స్ చేసుకోలేదని రద్దీ లేకపోవడంతోనే రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

December 27, 2024 / 10:16 AM IST

దామరచర్లకు చంద్రబాబు సతీమణి

NLG: దామరచర్ల మండలం పుట్టగడ్డ తండాకు నేడు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రానున్నారు. పుట్టగడ్డ తండాలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, NTR సుజల వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.

December 27, 2024 / 10:16 AM IST

మహానగరానికి కొత్త మాస్టర్ ప్లాన్

HYD: మహానగరానికి కొత్త బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) దీనిపై కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ కన్సల్‌టెంట్ల ఆధ్వర్యంలో కొత్త మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నారు. కొత్త ఏడాదిలో సెప్టెంబరు, అక్టోబరు నాటికి దీనికి సంబంధించి ముసాయిదాను విడుదల చేయనున్నట్లు తాజాగా అధికార వర్గాలు తెలిపాయి.

December 27, 2024 / 10:15 AM IST

నిమ్స్ వద్ద రోగుల ఆందోళన

HYD: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద రోగులు ఆందోళనకు దిగారు. OP సేవలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో నిమ్స్ సిబ్బంది OP సేవలు నిలిపివేశారు. వైద్యసేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు.

December 27, 2024 / 10:13 AM IST

మన్మోహన్ సింగ్ మృతి.. మంత్రి, ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

KMM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. కేంద్ర ఆర్థికమంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

December 27, 2024 / 10:12 AM IST

రేపు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం

HYD: చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు పేర్కొన్నారు. టెర్మినల్ పనులకు రూ.413 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రయాణికుల రద్దీని తగ్గించడం కోసం సకల సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించినట్టు వెల్లడించారు.

December 27, 2024 / 10:11 AM IST

రాష్ట్రంలో ముగిసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పర్యటన

HYD: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆయన సతీమణి సుదేష్ ధన్‌ఖడ్లకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రోటోకాల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకట్‌రావు, డీజీపీ జితేందర్ ఇతర అధికారులు వీడ్కోలు పలికారు. రాష్ట్రంలో 2 రోజులపాటు పర్యటించిన ఉపరాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు.

December 27, 2024 / 09:58 AM IST

మన్మోహన్ సింగ్ మృతిపై ఎమ్మెల్యే సంతాపం

NRML: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంతాపం ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను తీసుకువచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుందన్నారు. మాజీ ప్రధాని మంత్రి పీవీ నరసింహారావుతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన చక్కదిద్దారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

December 27, 2024 / 09:57 AM IST