HYD: మహానగరానికి కొత్త బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) దీనిపై కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ కన్సల్టెంట్ల ఆధ్వర్యంలో కొత్త మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నారు. కొత్త ఏడాదిలో సెప్టెంబరు, అక్టోబరు నాటికి దీనికి సంబంధించి ముసాయిదాను విడుదల చేయనున్నట్లు తాజాగా అధికార వర్గాలు తెలిపాయి.