NLG: దామరచర్ల మండలం పుట్టగడ్డ తండాకు నేడు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రానున్నారు. పుట్టగడ్డ తండాలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, NTR సుజల వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారని తెలిపారు.