KMM: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆర్థిక వేత్తగా, అధ్యాపకుడిగా, ఆర్బీఐ గవర్నర్గా, రాజ్య సభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానిగా ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.