HYD: చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు పేర్కొన్నారు. టెర్మినల్ పనులకు రూ.413 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రయాణికుల రద్దీని తగ్గించడం కోసం సకల సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించినట్టు వెల్లడించారు.