• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గంజాయిని విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు

NZB: సిరికొండ మండలంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎక్కడైనా గంజాయి విక్రయించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి విక్రయంతో యువత తప్పు దోవకు దారి పడుతున్నారని తెలిపారు.

December 27, 2024 / 01:37 PM IST

స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి: కవిత

NZB: కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆమె బీసీ సంఘాలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది అని అన్నారు.

December 27, 2024 / 01:36 PM IST

మాజీ ప్రధాని మృతి దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే

BHNG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంతాపం తెలిపారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు.

December 27, 2024 / 01:34 PM IST

నేడు మంత్రి తుమ్మల నేటి పర్యటన వాయిదా

KMM: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారిక పర్యటన వాయిదా వేయడం జరిగిందిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ గమనించి సంతాప కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.

December 27, 2024 / 01:33 PM IST

“ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్”

MBNR: భారతదేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందన్నారు.

‘సీపీఎం పార్టీ మహాసభలను జయప్రదం చేయండి’

SRD: కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం నాయకులు ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు. సీపీఎం రాష్ట్ర 4వ మహాసభల కోసం విరివిరిగా విరాళాలు సేకరిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు నిర్వహించే సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయాలని గ్రామస్తులను సీపీఎం నాయకులు కోరారు.

December 27, 2024 / 11:55 AM IST

దేవాలయానికి వెళ్లకుండా ముళ్ళకంచ: అటవీ శాఖ అధికారులు

BDK: బూర్గంపాడు మండలం సారపాకలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ముళ్లకంచెను అడ్డుగా వేశారని స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి పుష్కరవనం నుంచి వెళ్లే దారి ఉండగా అటువైపు నుంచి వెళ్లకుండా కంచె వేసి భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముళ్లకంచెను తొలగించి భక్తులకు దర్శనం కల్పించాలని కోరారు.

December 27, 2024 / 11:34 AM IST

మన్మోహన్ మరణం బాధాకరం: ఎంపీ రఘునందన్

మెదక్: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన మరణం దేశానికి తీరని లోటని ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

December 27, 2024 / 11:30 AM IST

రేపు ఏడుపాయల దేవాలయంలో వేలం పాట

మెదక్: రేపు పాపన్నపేటలోని ఏడుపాయల దేవస్థానం నందు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు దేవస్థానం కార్యాలయం నందు టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. జనవరి 1 2025 నుంచి డిసెంబర్ 31 2025 వరకు దేవాలయంలో కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు కోసం స్టీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.

December 27, 2024 / 11:30 AM IST

కూరగాయల మార్కెట్‌ను తనిఖీ చేసిన వైస్ ఛైర్మన్

NGKL: కల్వకుర్తి ప్రభుత్వ కూరగాయల మార్కెట్‌ను శుక్రవారం మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పండిత్ రావు తనిఖీ చేశారు. మార్కెట్ రికార్డులను పరిశీలించారు. మార్కెట్‌లో రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల అమ్మకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.

December 27, 2024 / 11:26 AM IST

మాజీ ప్రధాని మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

WNP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఉపాధి పథకం, సమాచార హక్కు చట్టం సహా దేశ అత్యున్నత అనేక పదవులు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

December 27, 2024 / 11:18 AM IST

జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

SRD: పటాన్ చెరు మండలం పోచారం గ్రామ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

December 27, 2024 / 11:17 AM IST