NZB: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శుక్రవారం ఆమె బీసీ సంఘాలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది అని అన్నారు.