MBNR: ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ శుక్రవారం దిగ్భ్రాంతి తెలిపారు. ఈ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది అన్నారు. ఆర్థిక వేత్తగా, రిజర్వు బ్యాంకు గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఆయన సేవలు మరువలేనివి అన్నారు.