NGKL: చారకొండ మండలం ఎర్రవెల్లి గ్రామంలో డీఎస్ఐ జలాశయ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 11వ రోజుకు చేరాయి. ఎర్రవెల్లి గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి, R&R జీవోను రద్దు చేయాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంపై నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NGKL: జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడలకు ఎంపికైన బాలికలను కలెక్టర్ బదావత్ సంతోష్ శుక్రవారం తన చాంబర్‌లో అభినందించారు. 17 సంవత్సరాల విభాగంలో పి. అక్షర, 14 సంవత్సరాల విభాగంలో దివ్యాంజలి ఎంపికయ్యారు. ఈనెల 18 నుంచి 22 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో క్రీడల జిల్లా అధికారి సీతారాం తదితరులు పాల్గొన్నారు.
NZB: రెంజల్ మండలం తాడుబిలోలిలో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. గ్రామంలో నిర్వహించిన వార్డ్ మెంబర్ ఎన్నికల్లో మొత్తం ఆరుగురు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, ముగ్గురు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు, ఒక్కరు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ సభ్యుల నిర్ణయం మేరకు ఉపసర్పంచ్ ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేశారు.
NLG: చిట్యాల మండలంలో గ్రామంగా గుర్తింపుపొందిన వెలిమినేడులో సీపీఎం బలపరిచిన బొంతల చంద్రారెడ్డి విజయం సాధించాడు. ఆ గ్రామంలో సీపీఎం బలంగా ఉండడమే కాకుండా గత కొన్ని పర్యాయాలు ఆపార్టీ అభ్యర్థులు సర్పంచులుగా పాలన చేశారు. ప్రస్తుతం గెలిచిన అభ్యర్థి కూడా గతంలో సర్పంచ్‌గా పని చేయగా.. గ్రామస్తుల ఆదరణ ఇంకా ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువయింది.
KMR: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రెండో విడతలో లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.
HNK: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొమ్మటి కవిత, వార్డు మెంబర్ల గెలుపు కోసం MLA శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, తదితరులున్నారు.
BDK: టేకులపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూక్య దల్ సింగ్ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన ఆయన ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో రాజీనామా చేయడం పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.
ADB: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రేపు ( రెండవ శనివారం) పని దినముగా ఉంటుందని జిల్లా ఇంఛార్జ్ డీఈవో రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా గత అక్టోబర్ 7న రోజున సెలవు తీసుకున్నందువలన దానికి బదులుగా రేపు రెండవ శనివారం అన్ని పాఠశాలలు యధావిదంగా పనిచేయాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
SRPT: తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామంలో 95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన గుంటకండ్ల రామచంద్ర రెడ్డి, వార్డు సభ్యులను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ కలిసి అభినందించారు. రికార్డ్ స్థాయి ఈ విజయంతో యువతకు స్ఫూర్తిగా నిలిచారని, గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
VKB: తాండూరు మండలం ఓగిపూర్ గ్రామ సర్పంచ్ నారాయణ, ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌గా గెలిచినందుకు ఎమ్మెల్యే వారిని సన్మానించి అభినందించారు. గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
SRPT: నేరేడుచర్ల మున్సిపాలిటీలో 40 మంది పారిశుధ్య కార్మికులకు చలి నుంచి ఉపశమనం కల్పిస్తూ రాపోలు నవీన్ శీతాకాలపు ముఖ కవచాలు అందజేశారు. ఎండా, వానా, చలైనా పట్టణ పరిశుభ్రత కోసం కష్టపడే కార్మికుల సేవలు అమూల్యమని ఆయన పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నిత్యం కర్తవ్యాన్ని నిర్వర్తించే వారి కోసం “మీకోసం మేమున్నాం” అనే భావంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 5 మండలాల్లో మొత్తంగా 96,068 మంది ఓటర్లకు గాను 76,668 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కెరమెరి మండలంలో అత్యధికంగా 83.38 శాతం పోలింగ్ నమోదైంది. సిర్పూర్ (యూ) 81.18 శాతం వాంకిడి 78.93, లింగాపూర్ 79.61 శాతం , జైనూర్ 76.81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
BHPL: చిట్యాల మండలం కాల్వపల్లి, నైన్‌పాకల్లో BJP పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం.. ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు గాలికొదిలాయని, పంచాయతీలకు నిధులు ఆగిపోయాయని విమర్శించారు. BJP పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని, BJP పార్టీ నాయకులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
MHBD: కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామ సర్పంచ్ ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచే ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగారు. కొత్త రామతార- అంజయ్య (ఉంగరం), బండ రాజేశ్వరి- రామకృష్ణ(కత్తెర), నవలం ప్రతిభ-ఉపేందర్ (ఫుట్ బాల్)లు బరిలో ఉన్నారు. అందరూ ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచంద్రనాయక్ ఆశీస్సులతో గెలుస్తామని ధీమాగా ఉన్నారు.
RR: సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పర్యటించారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు మధ్య నీరు నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇప్పటికే మంజూరైన క్రాస్ డ్రెయిన్ నిర్మిస్తామని అన్నారు. నివాసులకు సరైన లైటింగ్, భద్రత నిర్ధారించడానికి కమ్యూనిటీ హాల్ గోడపై వీధి దీపాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.