• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గడుగు గంగాధర్‌ను సన్మానించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

NZB: జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైన గడుగు గంగాధర్‌ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు గురువారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నివాసంలో పద్మారావు పుష్ప గుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి ఎం.వి నాయక్ పాల్గొన్నారు.

December 26, 2024 / 05:32 PM IST

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వినతి

NRPT: మక్తల్‌ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు వినతి పత్రం అందించారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి సానుకూలంగా సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.

December 26, 2024 / 05:29 PM IST

సీఐ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

WGL: వేలేరు మండల కేంద్రానికి చెందిన సీఐ శంకర్ తండ్రి వంగపల్లి మల్లయ్య ఇటీవల మరణించారు. గురువారం బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ వేలేరు గ్రామంలోని శంకర్ నివాసానికి విచ్చేసి సీఐ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

December 26, 2024 / 05:27 PM IST

‘సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించాలి’

NRML: జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు హైదరాబాద్, హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు గురువారం బయలుదేరారు. జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

December 26, 2024 / 05:26 PM IST

విద్య రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే

MBNR: విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మదర్సా ఇస్లామియా కాసిఫ్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు గురువారం ఎమ్మెల్యే దుప్పట్లను పంపిణీ చేశారు. ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

December 26, 2024 / 05:25 PM IST

మరో మూడు రోజులపాటు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

NLG: వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున, పత్తి నిల్వలు పేరుకుపోయిన కారణంగా ఈనెల 27 నుంచి 29 వరకు పత్తి కొనుగోళ్లు సీసీఐ వారు నిలిపివేస్తున్నట్లు మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 30న తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే రెండు రోజులు(25,26 తేదీల్లో) సెలవులతో కొనుగోలు నిలిచిపోయింది.

December 26, 2024 / 05:25 PM IST

ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉదయ్ కిరణ్ నియామకం

మెదక్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలను సిద్దిపేట జిల్లాలో నిర్వహించారు. దీనిలో భాగంగా రెండవ సారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉదయ్ కిరణ్‌ను రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో రెండవ సారి చోటు కల్పించినందుకు రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

December 26, 2024 / 05:24 PM IST

‘ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది’

MBNR: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అందరి సమస్యలు పరిష్కరిస్తారని, మీ డిమాండ్లలో న్యాయం ఉందని వాటిని పరిష్కరించడానికి ఈనెల 29న సీఎంతో భేటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

December 26, 2024 / 05:20 PM IST

TSUTF మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ

NRML: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాదాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నల్గొండ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి 6 వ విద్య వైజ్ఞానిక మహాసభ పోస్టర్లను గురువారం నిర్మల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు దాసరి శంకర్, అశోక్ మాట్లాడుతూ.. మహాసభలకు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

December 26, 2024 / 05:19 PM IST

చేనేత ఐక్యవేదిక మండల అధ్యక్షుడుగా సాయిలు

SDPT: తెలంగాణ చేనేత ఐక్యవేదిక దూల్మిట్ట మండల అధ్యక్షుడిగా బడుగు సాయిలు నియామకమయ్యారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీర మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. జాతి చైతన్యం కోసం చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.

December 26, 2024 / 05:11 PM IST

కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మాజీ ఎమ్మెల్యే

WGL: నెక్కొండ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తైన కూడా నెక్కొండ మండల అభివృద్ధికి కొత్తగ ఎమైన నిధులు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు.

December 26, 2024 / 05:10 PM IST

ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం పూజలు

SDPT: హుస్నాబాద్‌లోనే ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.

December 26, 2024 / 05:09 PM IST

కార్పొరేటర్‌తో ఎమ్మెల్యే సమావేశం

HYD: ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ ఎంఐఎం కార్యాలయంలో కార్పొరేటర్ షపియుద్దీన్‌తో ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అరా తీశారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను కార్పొరేటర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

December 26, 2024 / 05:09 PM IST

తప్పిపోయి KPHB పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నచిన్నారి

HYD: KPHB PS పరిధిలోని జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ సమీపంలో మూడేళ్ల చిన్నారి తప్పిపోవడంతో గుర్తించిన పోలిసులు KPHB పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తనకు సంబంధించిన వివరాలను చెప్పే స్థితిలో చిన్నారి లేకపోవడంతో వివరాలను సేకరించడానికి ఇబ్బంది ఎదురవుతున్నట్లు చెప్పారు. ఈ అమ్మాయి వివరాలు తెలిస్తే వెంటనే KPHB పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

December 26, 2024 / 05:06 PM IST

సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్ష శిబిరానికి మాజీ ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులు వెంట రాగా మాజీ ఎమ్మెల్యే సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయపరమైన కోరిక తీర్చాలని డిమాండ్ చేశారు.

December 26, 2024 / 05:04 PM IST