మెదక్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలను సిద్దిపేట జిల్లాలో నిర్వహించారు. దీనిలో భాగంగా రెండవ సారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉదయ్ కిరణ్‌ను రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో రెండవ సారి చోటు కల్పించినందుకు రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.