HYD: KPHB PS పరిధిలోని జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ సమీపంలో మూడేళ్ల చిన్నారి తప్పిపోవడంతో గుర్తించిన పోలిసులు KPHB పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తనకు సంబంధించిన వివరాలను చెప్పే స్థితిలో చిన్నారి లేకపోవడంతో వివరాలను సేకరించడానికి ఇబ్బంది ఎదురవుతున్నట్లు చెప్పారు. ఈ అమ్మాయి వివరాలు తెలిస్తే వెంటనే KPHB పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.