NZB: కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో GP ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు డాక్టర్ టి.శ్రీనివాస్ 95 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో 17 మంది బాధితులకు కంటి ఆపరేషన్లు అవసరం ఉందని గుర్తించారు. నేత్ర పరీక్షలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సర్పంచ్ బైకని జమున మహేశ్, ఉప సర్పంచ్ భూమేశ్ సూచించారు.
ASF: పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడిన ఆవుకు 2 గంటలపైగా శ్రమించి పశు వైద్యులు మురళి ప్రసవం చేశారు. ఆసిఫాబాద్ మండలం మాణిక్ గుడాకి చెందిన రైతు కన్నెరాం ఆవు శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడింది. పరిస్థితిని గమనించిన ఉప సర్పంచ్ అజయ్ పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. 2 గంటలపైగా శ్రమించి దూడను వైద్యులు బయటకు తీయగా దూడ మృతి చెందిందని తెలిపారు.
KMR: మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్, హాసన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. గాలిపూర్‌లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.52 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
SDPT: నంగునూరు(మం) రాంపూర్ వద్ద సిద్దిపేట-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి వరంగల్ వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. జనరేటర్ లోడుతో ఉన్న ఈ వాహన బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.
KMR: రాజంపేట మండలం అరగొండలో ఎంపీడీవో బాలకృష్ణ అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక వసతులు, ప్రైమరీ స్కూల్, ఉపాధి హామీ పనులను, ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం పరిశీలించారు. తనిఖీ చేసి అక్కడ స్టాక్ రిజిస్టర్లు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు తినే మధ్యాహ్న భోజనాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రాంత్ రెడ్డి, ఉపసర్పంచ్ తుల రవి, ఏపీవో శృతి పాల్గొన్నారు.
ADB: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని శుక్రవారం కలెక్టర్ రాజర్షిషా సూచించారు. రెండవ విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లను అందజేశారు. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
SRPT: మఠంపల్లి మండలంలోని మంచ్య తండా నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మలోత్ భద్రమ్మ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం ముగిసిన ఈ శిక్షణలో భాగంగా డీఎల్‌పీవో చేతుల మీదుగా ఆమె శిక్షణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా భద్రమ్మ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో గ్రామ పంచాయతీ పాలనను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.
JGL: కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డుకు సమీపంలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా మొరం తరలిస్తున్న టిప్పర్ వాహనం శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనం వేగంగా మలుపు తిరుగుతుండగా నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. వాహనం దెబ్బతినడంతో పనులు కొంతసేపు నిలిచిపోయాయి.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల ముగిశాయి. ప్రస్తుతం నూతన కార్యవర్గం నెలకొనే సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ నేత గుండా సంతోష్‌ను నియమించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువడుతున్నాయి. ఈ మేరకు చాలామంది ఆయనను ప్రతిపాదిస్తూ బీజేపీ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.
నిర్మల్ మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గ తొలి సమావేశం శుక్రవారం జరిగింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పల గణేశ్ చక్రవర్తి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో 42 వార్డుల కౌన్సిలర్లు పాల్గొని పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, మున్సిపాలిటీ కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం వల్ల సమావేశం సమర్థవంతంగా సాగింది.
MDK: టేక్మాల్(మం) సంగ్య తండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సర్పంచ్ సక్రు, కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేశారు. ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద మంజూరైన రూ.20 లక్షలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ. 1,905 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ. 10వేలు, పచ్చి పల్లికాయకు రూ. 5,400 ధర వచ్చింది. పసుపు క్వింటాకి కొత్తది రూ. 11,151 ధర వస్తే.. నం. 5 రకం మిర్చి రూ. 20,200, దీపిక మిర్చి రూ. 20వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 4వ వార్డ్‌లో గల మక్కా మసీదుకు స్థానిక మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు యాదవ్ శుక్రవారం ఏసీని బహూకరించారు. ముస్లిం సోదరులు చేసిన విజ్ఞప్తి మేరకు వారు వెంటనే స్పందించి ఈవితరణకు పూనుకున్నారు. కార్యక్రమంలో వనమా వెంకటేశ్వర్లు, నిస్సార్, ఇబ్రహీం, ఫరీద్, సమీర్, జమీల్ అబ్దుల్, జానీ, జావిద్, పాష పాల్గొన్నారు.
PDPL: 2026- 27 విద్యా సంవత్సరం మోడల్ స్కూల్లో ప్రవేశాలకు రేపే చివరి తేదీ అని ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. 6వ తరగతిలో పూర్తి సీట్లు, 7 నుంచి 10 తరగతులకు మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో ఆన్‌లైన్ చేయడానికి సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.