• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఐఎస్ సదన్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు

HYD: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై జీ.వెంకటేశ్‌ను నగర CP సజ్జనర్ సస్పెండ్ చేశారు. విధి నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాల అవహేళన, అనుచిత ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గణేశ్ బందోబస్తు సమావేశానికి హాజరు కాకపోవడం, నెహ్రూ నగర్ ఘటనలో రౌడీ షీటర్ నిస్సార్‌పై చర్యలు తీసుకోకపోవడంతో పాటు తదితర నిర్లక్ష్యాలను కారణంగా చూపుతూ వేటు వేశారు.

March 4, 2026 / 11:01 AM IST

మరికల్ మండలంలో ఘనంగా హోలీ

NRPT: మరికల్ మండల కేంద్రంలో హోలీ సంబరాలను యువకులు ఘనంగా నిర్వహించుకున్నారు. బ్యాండ్ మేళాలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ హోలీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకున్నారు. కుల, మత ప్రాంతీయ భేదాలు లేకుండా నృత్య లు చేస్తూ హోలీ వేడుకలు నిర్వహించారు. మరికల్ మండలంలో అన్ని గ్రామాల్లో హోలీ పండుగలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ఈ హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

March 4, 2026 / 11:01 AM IST

సీసీ కెమెరాల ఏర్పాటు

SDPT: కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని తిమ్మారెడ్డిపల్లి, మంగోల్ గ్రామాలలో భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొగుట సీఐ, ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాల నియంత్రణకు ఇవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 4, 2026 / 11:01 AM IST

కలుషితంగా విడుదలైన త్రాగునీరు

WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో త్రాగునీరు మురికిగా వస్తుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గత మూడు రోజులుగా నీరు ఇలాగే మురికిగా, రంగు మారి రావడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని, చర్యలు చేపట్టి శుభ్రమైన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

March 4, 2026 / 11:01 AM IST

నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ

NLG: చిట్యాలలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునః నిర్మాణమై 23 ఏళ్లు ముగిసిన సందర్భంగా.. బొబ్బలి పాండు రెడ్డి తన బృందం, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, వడి బియ్యం సమర్పించారు. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని, నిర్మాణ కమిటీ వేడుకుంది.

March 4, 2026 / 10:58 AM IST

హోలీ సంబరాలు.. చిన్నారుల చిందులు

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం గ్రహణం కారణంగా పండితుల సూచన మేరకు వేచి చూసిన ప్రజలు, ఈరోజు ఉత్సాహంగా రంగుల పండుగను జరుపుకున్నారు. చిన్నారులు, యువకులు, మహిళలు వాడవాడలా రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు.

March 4, 2026 / 10:57 AM IST

‘పెరిగిన ఎండలు… కోతులకు చెట్ల నీడే ఆధారం’

MHBD: రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో సామాన్య ప్రజలు, వన్యప్రాణులు సైతం అల్లడిపోతున్నాయి. సాధారణంగా అడవిలో సంచరించే కోతులు అడవులోకి లేక గ్రామ శివారులో చెట్ల కింద ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తొర్రూరు మండలంలోని కంటాయపాలెం గ్రామ చెరువు కట్టమీద ఉన్నటువంటి చెట్ల కింద కోతులు సేద తీరుతున్న దృశ్యం HIT TV కంటపడింది.

March 4, 2026 / 10:50 AM IST

ప్రేమ వివాహం.. గర్భిణి అనుమానాస్పద మృతి

NGKL: కొల్లాపూర్ మండలం రామాపురానికి చెందిన బత్తిని మౌనిక, మాచినేనిపల్లి మాధవరావుపేటకు చెందిన నాగరాజు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గర్భిణి అయిన మౌనిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, భర్త నాగరాజు వేధింపుల వల్లే తన చెల్లి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. మౌనిక మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

March 4, 2026 / 10:45 AM IST

లబ్ధిదారులకు ఇళ్ల పత్రాల పంపిణీ చేసిన MLA

KMR: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం రామారెడ్డిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం అన్నారంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మరిన్ని ఇళ్లు నిర్మిస్తామన్నారు.

March 4, 2026 / 10:45 AM IST

మద్దతు ధర లేక ఆందోళనలో అన్నదాతలు

JGL: జిల్లాలో పసుపు పంటకు మద్దతు ధర లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతుండగా, ప్రస్తుతం క్వింటాల్ పసుపు రూ.9 వేల-రూ.14వేల వరకు మాత్రమే ధర పలుకుతుండగా పెట్టుబడులు కూడా లభించక అన్నదాతలు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి తమకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

March 4, 2026 / 10:44 AM IST

ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్’కు చొప్పదండి యువకులు

KNR: ‘ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్’కు చొప్పదండి పట్టణానికి చెందిన చల్లా అనూశ్, జాగిరి రాజేందర్ ఎంపికైనట్లు డివైవో రాంబాబు తెలిపారు. ఈనెల 9 నుంచి 13 వరకు కోయంబత్తూరులో ఈ ప్రోగ్రామ్ జరగనుండగా, KNR నుంచి వీరిద్దరు ఎంపికయ్యారని చెప్పారు. నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సామజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

March 4, 2026 / 10:43 AM IST

పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్

BDK: అశ్వాపురం మండలం ఆనందాపురంలో బుధవారం గ్రామపంచాయతీ సర్పంచ్ ముర్రం సమ్మయ్య ట్రాక్టర్ మీద తిరుగుతూ తానే స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తి చెత్తను సేకరించారు. గ్రామపంచాయతీలో పంచాయతీ మల్టీపర్పస్ కార్మికులకు జీతాలు రాకపోవడంతో గత కొన్ని నెలలుగా చెత్తను సేకరించడానికి కార్మికులు విధులకు రాకపోవడంతో ఆయనే పనులు చేపట్టారు.

March 4, 2026 / 10:40 AM IST

గత 2 నెలలుగా తాండూర్ SI పోస్టు ఖాళీ

MNCL: జిల్లా సరిహద్దులో ఉన్న తాండూర్ పోలీస్ స్టేషన్‌లో గత 2 నెలలుగా SI పోస్టు ఖాళీగా ఉంది. గత డిసెంబర్ 30న SI కిరణ్ కుమార్ హాజీపూర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యారు. మాదారం SI ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. రెగ్యులర్ ఎస్సై లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. SI పోస్టును భర్తీ చేస్తే శాంతిభద్రతలు పరిరక్షించే అవకాశం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

March 4, 2026 / 10:35 AM IST

క్వింటా పత్తి రూ.7,430

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం లాగే ఈరోజు సైతం పత్తి ధర స్థిరంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,430 ధర పలకగా.. ఈరోజు ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే, ఎల్లో రకం మిర్చికి రూ.21,000, టమాటా మిర్చికి రూ.38,500, 1048 రకం మిర్చికి రూ.19,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.

March 4, 2026 / 10:30 AM IST

సర్పంచ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, గ్రామ కాంగ్రెస్ నేతలు, సామాజిక సేవాకర్త దశరథ, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 10:30 AM IST