RR: నందిగామ కన్హ శాంతి వనంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా స్కిల్ రిజనల్ కాంపిటీషన్ నేడు ముగింపుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కాంపిటీషన్‌లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్‌తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు ఏదో ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు.
JN: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై ఎన్పిడిసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డితో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకువాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించే బాధ్యత నాదని ఎమ్మెల్యే అన్నారు.
SRPT: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో రూ.394 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన మంత్రి, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నిస్తూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టం సంభవించింది. మంగళవారం దుస్స శివ ఇంటిలో ఈ ఘటన జరిగింది. మంటల కారణంగా ఇంటి సామాన్లతో పాటు శివ నిర్వహిస్తున్న ఆటోమొబైల్ మెకానిక్ పనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.
SDPT: జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 82 కేంద్రాల్లో మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
JGL: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు జగిత్యాల జిల్లాలో మొత్తం 30 పరీక్ష కేంద్రాల్లో 15123 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు రాజగౌడ్, లత, ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని స్పష్టం చేశారు.
MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు నీటి వినియోగం, పంటల మార్పిడి పై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, ఉద్యాన శాఖ అధికారి రచన ఆధ్వర్యంలో పంటలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. నేలలో సేంద్రియ కార్బన్ ప్రాముఖ్యత ఎలా పెంచుకోవాలో వివరించారు.
SRD: నారాయణఖేడ్ పట్టణంలో ఆడియలోజిస్ట్ ఉచిత క్యాంపు నిర్వహించారు. వినికిడి సంబంధిత వైద్య నిపుణుడు డాక్టర్ రజనీకాంత్ 65 మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వినికిడి, సమతుల్యత సంబంధిత సమస్యలను నిర్ధారించి, చికిత్సలు చేశారు. వినికిడి లోపాలతో పాటు టిన్నిటస్ (కానుక శబ్దం), చిరాయి తిరగడం వంటి సమస్యలను పరీక్షించారు.
GDWL: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో హాజరుకావాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
KNR: గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శంకరపట్నం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ సూచించారు. తాడికల్ రైతు వేదికలో MPO ప్రభాకర్ అధ్యక్షతన 9 గ్రామాల నూతన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న 2వ రోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల జ్వరం వస్తుందన్నారు.
SRD: ప్రపంచానికి మేధావులను తయారు చేసే హైదరాబాద్ (కంది) IIT యూనియన్ ఎన్నికలలో సీఐటీయు నాయకుడు అతిమేల మాణిక్‌ను ఎన్నుకోవడం గర్వకారణంగా ఉన్నదని CITU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రాజయ్య అన్నారు. సీఐటీయు అంటే కేవలం కార్మికుల సమస్యలు కాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారానికి పోరాటం చేసే సంస్థ CITU అని అన్నారు.
ADB: లోకారి గ్రామం నుంచి గాదిగూడ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు వాపోతున్నారు. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్ల నుంచి ప్రయాణిస్తే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అని రాకపోకలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
KMR: అర్హులైన మైనార్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులు పాల్గొన్నారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి HYD వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి మంగళవారం ఆడిటర్లతో కలిసి సమీక్షించారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.