• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 7 హోటల్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 50-60 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమన్నారు.

February 26, 2026 / 08:11 PM IST

పుష్కరాలకు కావల్సిన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

NRML: రానున్న గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం, గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

February 26, 2026 / 08:10 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

MNCL: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, రహదారుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా చూడాలని, అనుమతి లేకుండా వాహనాల నిలుపుదలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

February 26, 2026 / 08:10 PM IST

చోరికి పాల్పడిన నలుగురు దొంగల అరెస్ట్

ASF: కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ కాలనీలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడిన దొంగలను గురువారం అరెస్ట్ చేసినట్లు SP నితిక పంత్ తెలిపారు. గత నెల 3న దండే మంగా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి 72 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.2,75,000 అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.

February 26, 2026 / 08:10 PM IST

రేపు జిల్లాలో జాబ్ మేళా

GDWL: గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో (రేపు) 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మీనాక్షి సీపీడీసీ సాయి శ్యామ్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు డిగ్రీ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులే అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 26, 2026 / 08:05 PM IST

పెగడపల్లి మండలానికి నిధుల మంజూరు

JGL: పెగడపల్లి మండలానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.51.52 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనట్లు మండల పంచాయతీ అధికారి శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ. 50 వేల నుండి రూ. ఆరు లక్షల వరకు మంజూరయ్యా యని, ఈ నిధులను ఆయా జీపీల్లో జమవుతాయన్నారు.

February 26, 2026 / 08:01 PM IST

మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జూపల్లి

ADB: మార్చి 10న ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆవిష్కరించారు. జాబ్ మేళాలో 50కి పైగా పాల్గొననున్న కంపెనీలలో 2000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 08:01 PM IST

జక్కాపూర్లో ఎన్ఎస్ఎస్ స్వచ్ఛ భారత్ ర్యాలీ

SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 3వ యూనిట్ ఆధ్వర్యంలో జక్కాపూర్ గ్రామంలో ప్రత్యేక శీతాకాల శిబిరం కొనసాగుతోంది. శిబిరం రెండో రోజు వాలంటీర్లు గ్రామంలోని అన్ని వీధుల్లో స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు, పాటల ద్వారా పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని నిర్మలంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

February 26, 2026 / 07:57 PM IST

బాధిత కుటుంబానికి CMRF చెక్కు పంపిణీ

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన సుద్ధకంటి బాలమ్మకు మంజూరైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి గురువారం అందించారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలికి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి సాకారంతో ఈ ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 07:54 PM IST

నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్‌ను సత్కరించిన ఎంపీ

నల్గొండ తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ఎన్నికైనటువంటి శ్రీమతి శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ భువనగిరి ఎంపీ చామలను ఘనంగా సత్కరించారు.

February 26, 2026 / 07:51 PM IST

టెన్త్ విద్యార్థులకు నగదు బహుమతికి హామీ

NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHSలో ఎన్పీ ఫౌండేషన్ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతిని ప్రకటించారు. ఫౌండేషన్ ఛైర్మెన్, సెక్రెటరీ తన్నీరు నిర్మలాదేవి, రాం ప్రభు విద్యార్థులకు ఇవాళ రాత సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రంలో హెచ్‌ఎం రమాదేవి, నర్సింగ్ రాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

NZB: భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

మహబూబాబాద్‌లో మెగా ఫ్రెయిట్ డిపోకు వినతి

MHBD: మహబూబాబాద్ పట్టణంలో రైల్వేమెగా ఫ్రెయిట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని సాధన కమిటీ ప్రతినిధులు నేడు సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మల్లాడిని కలిసి విజ్ఞప్తి చేశారు. డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాదనలను రైల్వే బోర్డు ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు.

February 26, 2026 / 07:46 PM IST

ఒక్కటైన తెలుగు అబ్బాయి.. జపాన్ అమ్మాయి..!

SRPT: ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి పీటలెక్కింది. మేళ్లచెరువుకు చెందిన వరగాని రాజేశ్ సాఫ్ట్‌వేర్. ఉద్యోగ రీత్యా జపాన్ వెళ్లి, అక్కడ టోక్యోకు చెందిన వకానాతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో బుధవారం ఖమ్మంలో వీరు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, విదేశీ వధువు మన సంస్కృతిలో మెరిసిపోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

February 26, 2026 / 07:46 PM IST

అప్పటి GHMC యాప్.. ఇప్పుడు My CURE

HYD: అప్పటి GHMC యాప్, ఇప్పుడు My CURE యాప్ అయింది. ఈ యాప్ జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సేవలు అందించడానికి ఉపయోగించేలా రూపొందించారు. My CURE అంటే మై కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఈ పేరు పెట్టారు. మూడు కార్పొరేషన్ల ప్రజలు ఈ యాప్ యూజ్ చేసుకుని ఫిర్యాదు చేయాలని సూచించారు.

February 26, 2026 / 07:45 PM IST