• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మెగా జాబ్ మేళాలో 285 మందికి ఉద్యోగ అవకాశం

హనుమకొండ జిల్లా కేంద్రంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించి 285 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించారు. ఏటూరు నాగారం ఎస్ఓ సురేష్ బాబు జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు ఎంపిక పత్రాలను అందజేశారు.

March 5, 2026 / 06:13 PM IST

ఐటీఐకి సీల్డ్ కోటేషన్లు ఆహ్వానం :అదనపు కలెక్టర్

మహబూబాబాద్ ప్రభుత్వ ఐటీఐలో వివిధ ట్రేడ్ కోర్సులకు అవసరమైన రా మెటీరియల్ కొనుగోలుకు సీల్డ్ కోటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. ఆసక్తి గల సంస్థలు మార్చి 6 నుంచి 12 వరకు జిల్లా కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో కోటేషన్లు సమర్పించవచ్చని, మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు కోటేషన్లు తెరవనున్నారు.

March 5, 2026 / 06:13 PM IST

నవోదయ పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ

జగిత్యాల జిల్లాకు కేటాయించిన జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ శాశ్వత భవన నిర్మాణం కోసం కోరుట్ల శివారులోని సర్వే నం.923లో 23 ఎకరాల ప్రతిపాదిత స్థలాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

March 5, 2026 / 06:09 PM IST

రేపు ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు 6న జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా కలెక్టరేట్ చేరుకొని, కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ‘ప్రజాపాలన’ అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.

March 5, 2026 / 06:09 PM IST

మణుగూరులో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు

భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం మణుగూరులో పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా తనిఖీ చేసారు.

March 5, 2026 / 06:08 PM IST

సరూర్‌నగర్ పరిధిలో విషాదం.!

RR: లింగోజిగూడ మణిపూర్ కాలనీలో నివసిస్తున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ శర్మ(17) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మ్యాథ్స్ 2A పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. హోలీ సందర్భంగా కుటుంబ సభ్యులు యాదగిరిగుట్టకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 5, 2026 / 06:06 PM IST

‘PM సూర్య ఘర్ సద్వినియోగం చేసుకోవాలి’

SRCL: పీఎం – సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. పీఎం-సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు నిర్వహిస్తామన్నారు.

March 5, 2026 / 06:05 PM IST

రేషన్ డీలర్ పై క్రిమినల్ కేసు నమోదు

KMM: చింతకాని (మం) నాగిలిగొండ రేషన్ దుకాణాన్ని గురువారం జిల్లా సివిల్ సప్లై అధికారి చందన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో షాపులో నిల్వ ఉండాల్సిన 112.61 క్వింటాళ్ల సరుకుకు బదులుగా 52.50 క్వింటాళ్ల సరుకు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ రేషన్ బియ్యంలో అక్రమాలు పాల్పడినట్లు నిర్ధారించడంతో అతనిపై 6A కేసు, క్రిమినల్ కేసు నమోదు చేశారు.

March 5, 2026 / 06:05 PM IST

నటుడు మురళీధర్ గౌడ్ సతీమణి కన్నుమూత

MDK: ప్రముఖ సినీ నటుడు ఐరేని మురళీధర్ గౌడ్ సతీమణి, రామాయంపేట మాజీ వార్డు సభ్యురాలు ఐరేని శశికళ (52) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శశికళ గతంలో రామాయంపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఐదేళ్ల పాలనలో సేవలందించారు.

March 5, 2026 / 06:03 PM IST

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: ఎమ్మెల్యే

NGKL: నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 5, 2026 / 06:01 PM IST

మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ అరెస్ట్

NLG: మిర్యాలగూడలో మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్‌ని మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీఎస్పీ రాజశేఖర్ రాజు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మాడుగుల పల్లి మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన లొడంగి యాదగిరి మిర్యాలగూడ పట్టణంలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. హైదరాబాద్‌లో పలు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేశారు.

March 5, 2026 / 06:00 PM IST

వినియోగదార హక్కులపై చైతన్య సదస్సు

BHNG: ప్రపంచ వినియోగదారుల హక్కుల దిన వారోత్సవాల సందర్భంగా గురువారం మోత్కూరులోని మండల మహిళ సమైక్య భవనంలో స్టార్టప్ విలేజ్ ఎంటర్ ప్రైమర్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళ వినియోగదారుల హక్కులు బాధ్యతలపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పోచం సోమయ్య పాల్గొన్నారు.

March 5, 2026 / 06:00 PM IST

ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం పట్టణంలోని ప్రభుత్వ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు వడ్డించే ముందు పర్యవేక్షకులు తప్పనిసరిగా ఆహారాన్ని రుచి చూడాలని ఆదేశించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

March 5, 2026 / 06:00 PM IST

సతీష్ చిత్రపటానికి పూల నివాళులు అర్పించిన: గంట

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల చెందిన బీజేపీ నేత జడ సతీష్ ఇటివల గుండెపోటుతో మరణించడంతో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. సతీష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం, సానుభూతి తెలియజేశారు. బీజేపీ కోసం అహర్నిశలు కృషిచేసిన వ్యక్తి కాబట్టి వారి లోటు ఎల్లవేళలా తీర్చలేనిదని అన్నారు.

March 5, 2026 / 05:58 PM IST

పీఎం ఈజీపీ కార్యక్రమంపై అవగాహన

NRML: సారంగాపూర్ మండలంలోని చించోలి–బి గ్రామ మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, టీఎస్‌డబ్ల్యుసీడీసీ విజయలక్ష్మి పాల్గొని PMEGP,PMFME పథకాలపై వివరించారు.

March 5, 2026 / 05:52 PM IST