WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా గరుడ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ప్రసాదం స్వీకరిస్తే ఫలితం ఉంటుందని వేద పండితులు పేర్కొన్నారు. భక్తులు ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని వారు కోరారు.
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షకు హాజరయ్యారు. అధికారులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించారు.
SRPT: యాసంగి సీజన్‌కు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి జలాలను బుధవారం సాయంత్రం పెంచారు. 1,750 క్యూసెక్కులు వదులుతుండగా 1,810 క్యూసెక్కులకు పెంచారు. రెతులు నీటిని వృథా చేయవద్దని జలవనరులశాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయన్న వాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు.
JGL: మెట్‌పల్లి ఆర్డీవోగా పనిచేస్తున్న నక్క శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆర్డీవో నరసింహారావును మెట్‌పల్లికి నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
PDPL: ధర్మారంలో గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 333 మంది, సాధన జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
HNK: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఇప్పటికే ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలు కూడా అదనపు బాధ్యతలుగా చేపట్టనున్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.18400, క్వింటాల్ 341 (కారం కాయ) ధర రూ.21000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ.24000, క్వింటాల్ వండర్ హాట్ మిర్చి ధర రూ.37000, క్వింటాల్ టమాటో మిర్చి ధర రూ.40000గా పలికింది. నేడు మార్కెట్లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో స్వయం సహాయక సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
NLG: నార్కట్‌పల్లి మండలం, షాపల్లి, అమ్మనబోలు గ్రామ పంచాయతీలు గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి హెచ్చరించింది. అటు అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఈ మార్పు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి మరి.
KNR: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 424, వొకేషనల్ విద్యార్థులు 245 మంది హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వెంకటస్వామిని కలిశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత, వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.
KMR: పల్వంచ మండలానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యాశ్రీ జిల్లా స్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచింది. కామారెడ్డిలో నిర్వహించిన పరీక్షలో మొత్తం 97 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యాశ్రీని జిల్లా విద్యాధికారి రాజు, మెమెంటోతో సత్కరించినట్లు ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలలో వివిధ కేసులు పట్టుబడిన వాహనాలకు గాను గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో వేలం వేయనన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వం నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలు పాల్గొనవచ్చు అని వెల్లడించారు.
NZB: డ్రంక్&డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో వేంపల్లికి చెందిన అదిగేమ్ రాజేశ్వర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. బుధవారం నిందితుడిని ఆర్మూర్ జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ భవ్యశ్రీ ఎదుట హాజరుపరచగా,ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా బదిలీ చేయగా, జిల్లాలో తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలు అందించిన ఫైజాన్ అహ్మద్, త్వరలోనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.