• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు

NZB: ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహింప చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.

February 25, 2026 / 04:06 PM IST

‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

KNR: మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. లైంగిక వేధింపుల నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం KNR కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా అవగాహన శిబిరం నిర్వహించారు.

February 25, 2026 / 04:05 PM IST

‘విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయం’

KMR: పెద్ద కొడప్గల్ మండలం బాబుల్ గావ్ ప్రాథమిక పాఠశాలలో నూతన మరుగుదొడ్డి నిర్మాణానికి బుధవారం సర్పంచ్ రవి కుమార్ భూమి పూజ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ పని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బీర్ గోండా, కాంగ్రెస్ అధ్యక్షుడు విఠల్ రెడ్డి పాల్గొన్నారు.

February 25, 2026 / 04:04 PM IST

ఈనెల 27 నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

PDPL: అంతర్గాం మండలం మూర్ముర్‌లో నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 27న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. మార్చి 1, 2 తేదీలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. గత 66 ఏళ్లుగా గోపు వంశీయులు కొమురన్న పేరుతో ఈ జాతరను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

February 25, 2026 / 04:03 PM IST

ఘనంగా బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

VKB: చౌడాపూర్ మండలం పచ్చవుకుంట తండాలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సామరస్యాన్ని పెంపొందిస్తాయని గ్రామప్రజలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, సర్పంచ్ సవిత రాజు, చౌడాపూర్ సర్పంచ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్, రాము, గ్రామస్థులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:03 PM IST

అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

WNP: అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులకు, భక్తుల పిలుపు మేరకు అయ్యప్ప స్వామి దర్శనానికి విచ్చేసిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కి ఘన స్వాగతం పలికారు. వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. విచ్చేసిన భక్తులకు, కమిటీ సభ్యులకు పేరుపేరునా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:03 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

NLG: దేవరకొండ ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పాపారాజు, కార్మికులు కలిసి వారి సమస్యల గురించి ఎమ్మెల్సీ కోదండరామ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పూర్తి స్థాయిలో వారి సమస్యలను విని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 04:02 PM IST

సిరిసిల్ల జిల్లాలో 119 మంది గైర్హాజరు

SRCL: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలి రోజు 4209 మంది విద్యార్థులు హాజరైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన తొలి రోజు పరీక్షలో 4046 మంది రెగ్యులర్, 283 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి 4328 మంది విద్యార్థులకు గాను, 4209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

February 25, 2026 / 04:02 PM IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

ADB: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లెర్న్ స్మార్ట్ విత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం పెరగడంతో పాటు విషయ పరిజ్ఞానం సైతం పెరుగుతుందన్నారు.

February 25, 2026 / 04:02 PM IST

మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

ADB: జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మార్చి 28న జరిగే అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

February 25, 2026 / 04:02 PM IST

మంత్రిపై దాడి బాల్క సుమన్ అహంకారానికి నిదర్శనం

MNCL: మంత్రి వివేక్ పై BRS నాయకుల తీరును చెన్నూర్ కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. క్యాతన్పల్లి ఘటనలో మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు వేయడానికి వెళ్లిన మంత్రిపై దాడికి పాల్పడటం బాల్క సుమన్ అహంకారానికి నిదర్శనమన్నారు. తప్పు చేసి మంత్రిపైనే విమర్శలు చేయడం సరికాదని, BRS నేతలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

February 25, 2026 / 04:01 PM IST

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ పెద్ద బండలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అందజేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్, మంత్రి వెంకట్ రెడ్డి సహకారంతో డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు.

February 25, 2026 / 03:57 PM IST

పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

NGKL: బల్మూర్ మండలం మంగలికుంటపల్లి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటయ్య యాదవ్ పనులు ప్రారంభించారు. పంచాయతీ భవనానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వెంకటేశ్వరరావు, కృష్ణ రావులను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు.

February 25, 2026 / 03:52 PM IST

కుమ్మర మల్లన్న జాతర ఘటన సిగ్గుచేటు

MDK: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చేగుంటలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని ఘటనకు పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చేగుంట మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రఫీ అన్నారు.

February 25, 2026 / 03:52 PM IST

గోపలాయపల్లి గుట్టపై వైభవంగా సుదర్శన హోమం

NLG: నార్కట్ పల్లి మండలం, గోపలాయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల రోహిణి నక్షత్రం సందర్భంగా గుట్టపై హోమాన్ని నిర్వహిస్తారు. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి హోమాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు.

February 25, 2026 / 03:51 PM IST